Mayawati
Announces Political Successor:
సార్వత్రిక
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఎస్పీ(BSP)
అధినేత్రి మాయావతి, కీలక విషయం వెల్లడించారు. తన రాజకీయ వారసుడిగా మేనల్లుడు ఆకాశ్ఆనంద్
ను ప్రకటించారు. లక్నోలో నిర్వహించిన ముఖ్యనేతల సమావేశంలో మాయావతి ఈ విషయాన్ని
వెల్లడించారు.
తన తర్వాత, పార్టీ పగ్గాలు చేపట్టేది ఆకాశేనని స్పష్టం చేశారు.
మాయావతి
తమ్ముడి కుమారుడే ఆకాశ్ ఆనంద్, లండన్
లో ఉన్నత విద్య అభ్యసించారు. అయన ఎంబీఏ పట్టభద్రుడు. 2016లో బీఎస్పీలో చేరిన ఆకాశ్, 2019 ఎన్నికల ప్రచారంలో
కీలకంగా వ్యవహరించారు. తక్కువ సమయంలో మంచి
గుర్తింపు సాధించి పార్టీలో నంబరు2 స్థానాన్ని అందుకున్నారు.
ఏడాది కాలంగా ఆయన
పార్టీ వ్యవహారాల ఇంచార్జీగా వ్యవహరిస్తున్నారు.
బీఎస్పీ
సోషల్ మీడియా వ్యవహారాలు పర్యవేక్షిస్తున్న ఆనంద, ఎన్నికల వేళ స్టార్ క్యాంపెయినర్
గా వ్యవహరించారు. రాష్ట్రాల్లో ఆ పార్టీ శ్రేణులు చేపట్టే కార్యక్రమాల్లో పాల్గొంటూ
కేడర్ తో మమేకం అవుతున్నారు.
ఎంపీ
డానిష్ అలీని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన గంటల వ్యవధిలోనే మాయావతి ఈ నిర్ణయం
తీసుకున్నారు. పార్టీ వ్యతిరేక
కార్యకలాపాలకు పాల్పడినందుకు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.
లోక్
సభ నుంచి బహిష్కరణకు గురైన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రీ కి న్యాయం చేయాలంటూ బాధితురాలిని
దోషిగా చూడవద్దంటూ అని రాసి ఉన్న ప్లకార్డును మెడలో వేసుకుని అలీ నిరసన తెలిపారు.
అలాగే పార్లమెంటులో తనను దూషించిన
ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనను
పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు మాయావతి ప్రకటించారు. పార్టీ నియామావళిని పదేపదే
ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు వివరించారు.