BJP appoints three
central observers: మూడు రాష్ట్రాల
అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి మంచి జోష్ మీదున్న బీజేపీ, ముఖ్యమంత్రుల
ఎంపికలో మాత్రం ఆచితూచి స్పందిస్తోంది. ఆశావహులు,
అర్హుల జాబితాను జల్లెడ పడుతున్న బీజేపీ అగ్రనేతలు, సార్వత్రిక ఎన్నికల్లో విజయమే
లక్ష్యంగా నిర్ణయాలకు సిద్ధమవుతున్నారు.
మధ్యప్రదేశ్లో
బీజేపీ మరోసారి పాలకపార్టీగా అవతరించడంతో సీఎం ఎంపికపై ఆ పార్టీ సెంట్రల్ కోర్
కమిటీ తీవ్ర కసరత్తు చేస్తోంది. ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ఎమ్మెల్యేల
అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
బీజేపీ
మేధోమథనం కొనసాగుతున్న తరుణంలో మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ చేసిన ఓ
ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ఎవరికివారు ఇష్టానుసారంగా ద్వంద్వార్థాలు, అంతరార్థాలు
చెప్పడం రాజకీయంగా పలు అనుమానాలకు తావిస్తోంది.
‘అందరికీ
రామ్ రామ్’ అంటూ చౌహాన్ చేసిన ట్వీట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా
మారింది. ఇకపై ముఖ్యమంత్రిగా ఉండబోను అంటూ
పరోక్షంగా హింట్ ఇచ్చారని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదంపై స్పందించిన చౌహాన్
తన ట్వీట్ ను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. రాముడి పేరుతో దినచర్య ప్రారంభించడం దేశ
సంస్కృతిలో భాగమని అందుకే అలా ట్వీట్ చేశానని వివరణ ఇచ్చారు. పరోక్షంగా తాను
పోటీలో ఉన్నానని చెప్పకనే చెప్పారు.
మధ్యప్రదేశ్
సీఎం రేసులో శివరాజ్ సింగ్ చౌహాన్ తో పాటు జ్యోతిరాధిత్య సింధియా, కేంద్రమంత్రులు
నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు.
ముఖ్యమంత్రి
ఎంపిక కోసం హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్,
మధ్యప్రదేశ్ బీజేపీ చీఫ్ డీవీ శర్మ సహా పలువురు ముఖ్యనేతలతో కమిటీ ఏర్పాటు చేశారు.