Bharat-South Africa T20 2023: ఆస్ట్రేలియాతో
జరిగిన టీ20 సిరీస్ను కైవసం చేసుకున్న సూర్యకుమార్ సేన, దక్షిణాఫ్రికా పర్యటనలోనూ
సత్తా చాటేందుకు సిద్ధమైంది. యువ ప్రతిభావంతులైన ఆటగాళ్లతో డర్బన్ వేదికగా
హోరాహోరీ పోరుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి.
ఓపెనర్లు
శుభమన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, సిరాజ్ లో జట్టులోకి వచ్చారు.
రుతురాజ్
ఫామ్ లో ఉండటం, టాపార్డర్ లో శ్రేయస్ అయ్యర్ అందుబాటులో ఉండటంతో భారత్కు కలిసొచ్చే
అంశం. బ్యాటింగ్ ఆర్డర్ తో పాటు బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగా మారింది.
రవిబిష్ణోయ్, అర్ష్ దీప్ లతో బౌలింగ్ విభాగం మెరుగుపడింది.
దక్షిణాఫ్రికా
జట్టు కూడా యువఆటగాళ్ళతో బరిలోకి దిగుతోంది. మార్క్రమ్ నేతృత్వంలోని సఫారీ
జట్టుకు సొంతదేశంలో ఆడటం కలిసివచ్చే అంశం.
హెండ్రిక్స్,
స్టబ్స్, క్లాసెన్, మిల్లర్ లు మ్యాచును మలుపు తిప్పగలరు. కొయెట్జీ, షమ్సీ, కేశవ్
మహరాజ్ బౌలింగ్ లో ప్రతిభ చూపుతున్నారు.
టీ20కు
సరిపోయే పిచ్, బ్యాటింగ్ కు అనుకూలమైనప్పటికీ ఉదయం వాన ముప్పు ఉంది. సాయంత్రానికి
వాతావరణం తేలిపోయే అవకాశముంది. ఇక్కడ జరిగిన మూడు మ్యాచుల్లో తొలి ఇన్నింగ్స్ లో 190 పై చిలుకు పరుగులు
నమోదయ్యాయి.
గత
ఎనిమిదేండ్లలో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ టీ20 సిరీస్ కోల్పోలేదు. 2015లో భారత్
పై సఫారీ జట్టు నెగ్గింది.