Karni Sena chief murder case:
రాష్ట్రీయ
రాజ్పుత్ కర్ణిసేన అధినేత సుఖదేశ్ సింగ్ గొగమెడి హత్య కేసులో పోలీసులు పురోగతి
సాధించారు. హత్యతో సంబంధమున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు
షూటర్లు సహా వారికి సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని దర్యాప్తు
చేస్తున్నారు.
రోహిత్
రాథోర్, నితిన్ ఫౌజీ అనే ఇద్దరు షూటర్లను ఛండీగఢ్ లో రాత్రి అరెస్టు చేశారు.
దిల్లీ, రాజస్థాన్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి నిందితులను అదుపులోకి
తీసుకున్నారు. నిందితులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటంతో పాటు పరారీలో ఉన్న ఉద్దమ్
సింగ్ అనే వ్యక్తిని కూడా పోలీసులు కస్టడీలోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటి
వరకు ఈ కేసులో నలుగురిని పోలీసులు అదుపులోకి
తీసుకున్నారు.
రాజస్థాన్ కు చెందిన రామ్వీర్ జట్, శనివారం నాడు పోలీసులకు
దొరికాడు. హత్య జరిగిన ప్రదేశం నుంచి షూటర్లు తప్పించుకునేందుకు సహకరించిన రామ్వీర్,
తన బైకు పై హంతకులను అజ్మీరు రోడ్డులో దించాడు.
రాజస్థాన్
కు చెందిన కర్ణిసేన అధ్యక్షుడు గొగమెడిని దుండగులు పాయింటుబ్లాక్లో కాల్చి హతమార్చారు.
క్రాస్ ఫైరింగ్ లో ఓ హంతకుడు కూడా ప్రాణాలొదిలాడు. మరో ఇద్దరు తప్పించుకుని ఇతర
రాష్ట్రాల్లో తలదాచుకునేందుకు ప్రయత్నించారు. వారిని ఛండీగఢ్ లో పోలీసులు
అదుపులోకి తీసుకున్నారు.
ఈ
హత్యను తామే చేశామని గ్యాంగ్ స్టర్ రోహిత్ గోడరా ఇప్పటికే ప్రకటించాడు. తమ
శత్రువులకు గొగమెడి సాయం చేయడంతోనే అతడిని మట్టుబెట్టినట్లు తన పేస్ బుక్ ఖాతాలో
పోస్టు చేశాడు.
హత్య
అనంతరం షూటర్లు, రోహిత్ గొడరా ప్రధాన అనుచరుడు వీరేంద్ర చౌహన్ తో మాట్లాడారని
పోలీసుల విచారణలో తేలింది. మొబైల్ ఫోన్ల
ఆధారంగా నిందితుల జాడను పోలీసులు కనుగొన్నారు. పరారీలో ఉంటూనే వీరేంద్ర చౌహాన్
హంతకులు మాట్లాడేవారు.
కర్ణిసేన చీఫ్ గొగమెడి హత్య
రాజస్థాన్లో రాజకీయ దుమారం రేపింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి
మద్దతిచ్చినందుకే ఆయనపై కాంగ్రెస్ పగ తీర్చుకుందని బీజేపీ ఆరోపించింది.
గొగమెడికి ప్రాణాలకు ప్రమాదం ఉందని, సెక్యూరిటీ పెంచాల్సిందిగా
కోరినప్పటికీ సీఎం గెహ్లాట్ ఎలాంటి చర్య తీసుకోకపోవడమే ఇందుకు కారణమని బీజేపీ
నేతలు విమర్శించారు.