England beats Bharat by four wickets: భారత
మహిళల క్రికెట్ జట్టు వరుసగా రెండో మ్యాచులోనూ ఓడింది. దీంతో ఇంగ్లండ్తో
జరుగుతున్న టీ20 సిరీస్ను కోల్పోయింది. మూడు మ్యాచుల సిరీస్లో భాగంగా ముంబై
వాంఖడే లో జరిగిన రెండో పోరులో మన జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఇంగ్లండ్ పై
ఓడింది. దీంతో ఆంగ్లేయుల జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ను 2-0తో కైవసం
చేసుకుంది.
టాస్
ఓడి మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 16.2 ఓవర్లలో 80 పరుగుల చేసి ఆలౌటైంది. జెమీమా
రోడ్రిగ్స్(30) మినహా అంతా విఫలమయ్యారు. షఫాలీ వర్మ డకౌట్ కాగా, స్మృతి మంధన పది
పరుగులు వద్ద వెనుదిరిగారు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన వారంతా వరుసగా పెవిలియన్
చేరారు.
ఇంగ్లండ్
జట్టు 11.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 82 పరుగులు చేసింది. ఓపెనర్లు డాని
వైట్(0), సోఫియా డన్క్లీ(9) విఫలమైనా, అలైస్ కాప్సీ(25), నట్ సీవర్(16) జట్టును
విజయం వైపు నడిపించారు. దీప్తి, రేణుక
చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల
మధ్య మూడో టీ20 నేడు జరగనుంది.