అంత్యోదయ
స్పూర్తితో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ఫ్రభుత్వం సేవ చేస్తుంటే, కాంగ్రెస్ నేతృత్వంలోని I.N.D.I.A ( ఇండీ)కూటమి మాత్రం అక్రమార్జనలో
నిమగ్నమైందని ఏపీ బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ అన్నారు. వికసిత్ భారత్ కోసం ప్రధాని మోదీ పనిచేస్తుంటే కాంగ్రెస్
దాని మిత్ర పక్షాలు మాత్రం ‘బ్రష్టాచార్ భారత్’ కోసం పనిచేస్తున్నాయని దుయ్యబట్టారు.
కేడర్‌ను అవినీతి ఏటీఎంలుగా మార్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుందని ఎద్దేవా చేశారు.
రాజకీయాలు, రాజ్యాంగ పదవులు అడ్డుపెట్టుకుని ప్రజాధనాన్ని దోచుకుంటుంటే, కేంద్ర ప్రభుత్వం
చూస్తూ ఊరుకోదన్నారు. అవినీతిపరులు అక్రమంగా పొగుచేసిన ప్రతీ రుపాయిని చట్టబద్ధంగా
కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందన్నారు. ఇదీ మోదీ గ్యారెంటీ అని
అభివర్ణించారు.
అవినీతిపరులు
దోచుకున్న సొమ్మును స్వాధీనం చేసుకుని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల కోసం బీజేపీ
ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.
జార్ఖండ్‌కు
చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూకు చెందిన వ్యాపారసంస్థలతో పాటు ఆయన బంధువుల కంపెనీల్లో
పెద్ద మొత్తంలో అక్రమంగా దాచిన నగదు బయటపడటాన్ని ప్రస్తావించారు. ఇప్పటికే లెక్కలు
చూపని రూ. 290 కోట్ల నగదును ఐటీ అధికారులు
సీజ్ చేశారని దర్యాప్తు పూర్తయ్యే లోపు అది రూ. 500 కోట్లకు చేరే అవకాశం
ఉందన్నారు.
జార్ఖండ్
కు చెందిన ఎంపీ ధీరజ్ సింగ్ సాహూతో పాటు అతని బంధువుల నివాసాలు, వ్యాపార కార్యాలయాల్లో
భారీ మొత్తంలో అక్రమ నగదు దొరికింది. . ఒక్క
కాంగ్రెస్ ఎంపీ వద్దే రూ.290 కోట్లు దొరికితే మిగతా వారి దగ్గర ఇంక ఎంత నగదు ఉంటుందోనని అనుమానం వ్యక్తం చేశారు. ఈ లెక్కన “
గాంధీ “ పేరు చెప్పుకునే కుటుంబం ప్రపంచంలోనే అత్యంత అవినీతిపరుల కుటుంబం అని
అనుకోవచ్చా అని నిలదీశారు.
ఇండీ
కూటమిలోని పలువురు నేతల నివాసాల్లో ఐటీ అధికారులు సీజ్ చేసిన నగదు విషయాన్ని
దినకర్ ప్రస్తావించారు. బెంగళూరులో కాంగ్రెస్ నాయకుడి బంధువు
ఇంట్లో రూ. 42 కోట్ల నగదును ఐటీ అధికారులు సీజ్
చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా
పీయూష్ జైన్ నివాసంలో రూ. 200 కోట్లు, జులై 2022లో
టీఎంసీ మంత్రి పార్థు ఛటర్జీ నివాసాల్లో రూ. 50
కోట్ల నగదు, బంగారాన్ని అధికారులు స్వాధీనం
చేసుకున్నారన్నారు.
చెన్నైలో
ఆదాయపు పన్ను అధికారులు దాడులు నిర్వహించగా
రూ. 142 కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నారని, జూన్ 2022లో సత్యేంద్ర జైన్ కు చెందిన
నివాసాల్లో రూ. 2.82 కోట్ల నగదు, 133 బంగారు నాణేలు ఈడీ స్వాధీనం చేసుకుందన్నారు.
మే 2022లో జార్ఖండ్ లో ఈడీ నిర్వహించిన
సోదాల్లో పలువురు అధికారుల నివాసాల నుంచి రూ. 20కోట్లకు
పైగా నగదు స్వాధీనం చేసుకున్నట్లు వార్తలొచ్చాయన్నారు.
కాన్పూర్ లో ఐటీ అధికారుల దాడుల్లో రూ. 95 కోట్ల విలువైన రద్దు చేయబడిన రూ. 500, రూ.1000 నోట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
జార్ఖండ్
లోని ఇండీ ప్రభుత్వం లో ఉపాధి హామీ పథకంలో
రూ. 500 కోట్ల అక్రమాలు, బొగ్గు గనుల కేటాయింపు స్కాం, గనుల అక్రమ తవ్వకాలలో రూ. 1,500 కోట్లు, గ్రామీణ వికాస నిధిలో రూ. 1,500
కోట్లు, భూ స్కాముల్లో రూ, 3,000 కోట్లు చేతులుమారయన్నారు. లిక్కర్ స్కాం విలువు రూ. 1,500
కోట్లు ఉంటుందన్నారు.