Sovereign Gold Bond Scheme: మరో రెండు విడతల్లో సావరీన్ గోల్డ్ బాండ్లను(ఎస్‌జీబీ)
ఈ ఆర్థిక ఏడాదిలో ప్రభుత్వం జారీ చేయనుంది. ఇప్పటికే రెండు విడతల్లో ఎస్‌బీజీలను జూన్19-23,
సెప్టెంబరు 11-15 తేదీల్లో జారీ చేసింది.
మూడో
విడతగా ఈ నెల 18 నుంచి 22 తేదీల్లో నాలుగో విడత బాండ్లను ఫిబ్రవరి 12 నుంచి 16
తేదీల్లో జారీ చేయనుంది.
దీనిలో పెట్టుబడి పెట్టడం ద్వారా ఏడాదికి 2.50 శాతం స్థిర వడ్డీని పొందవచ్చు.
వాణిజ్య,
చిన్నరుణ, చెల్లింపుల బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, పోస్టు ఆఫీసులు,
స్టాక్ ఎక్సేంజీల ద్వారా వీటిని విక్రయిస్తారు. ఎస్‌జీబీలకు దరఖాస్తు
చేసుకునేందుకు నిర్ణయించిన తేదీలకు ముందు వారంలో చివరి 3 రోజుల సగటు ధర ఆధారంగా
బాండ్ విలువను పరిగణనలోకి తీసుకుంటారు.
ఇండియా
బిలియన్ అండ్ జువెలర్స్ అసోసియేషన్ లిమిటెడ్ ప్రకటించిన ధరలే ప్రామాణికం, ఆన్‌లైన్
లో దరఖాస్తు చేసుకుని డిజిటల్ గా చెల్లించే వారికి గ్రాముకు రూ50 మేర రాయితీ
ఇస్తారు.