ఆంధ్రప్రదేశ్లో
రైల్వేల అభివృద్ధి కోసం కేంద్రం రూ.8,406 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేంద్రమంత్రి
అశ్విని వైష్ణవ్ అన్నారు. భూకేటాయింపుల విషయంలో రాష్ట్రప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు.
ఉత్తరాంధ్రలో పర్యటించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్, అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్
లో భాగంగా రూ. 20 కోట్లతో రైల్వేశాఖ చేపట్టిన సింహాచలం స్టేషన్ ఆధునికీకరణ పనులు ప్రారంభించారు.
విజయనగరం
జిల్లా కంటకాపల్లి రైల్వే ప్రమాదం మానవతప్పిదంతోనే జరిగిందన్నారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. త్వరలో
దేశవ్యాప్తంగా మరిన్ని వందే బారత్ రైలు సర్వీసులు అందుబాటులోకి వస్తాయన్న
కేంద్రమంత్రి, రైల్వేలను రాజకీయాలతో ముడిపెట్టి చూడటం సరికాదన్నారు. వచ్చే దీపావళి నాటికి బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు
అందుబాటులోకి వస్తాయని, ఉత్తరాంధ్రలో ఎక్కువ టవర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
బీజేపీ
నేతలతో కలిసి సింహాచలం అప్పన్న స్వామిని దర్శించుకున్నారు. కేంద్రమంత్రి అశ్విని
వైష్ణవ్ కు ఆలయ సిబ్బంది, అర్చకులు స్వాగతం పలికారు. కేంద్ర ప్రభుత్వ సాయంతో
జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని అధికారులు వివరించారు.