హమాస్‌ను భారత్ ఉగ్ర సంస్థగా ప్రకటించలేదు. హమాస్‌ను కేంద్రం ఉగ్రసంస్థగా ప్రకటించిందని, ఆ ఫైలుపై విదేశాంగ శాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి సంతకం చేశారంటూ ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కేంద్ర సహాయ మంత్రి స్పందించారు. హమాస్‌కు సంబంధించిన ఎలాంటి ఫైల్‌పై తాను సంతకం చేయలేదని మీనాక్షి లేఖి స్పష్టం చేశారు.
మీ ముందు తప్పుడు సమాచారం ఉంది. హమాస్ (israel hamas war) అంశంపై ఏ దస్త్రంపై నేను సంతకం చేయలేదంటూ కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి మీనాక్షి లేఖి ట్వీట్ చేశారు. దీనిపై విచారణ జరుగుతోందని, త్వరలో అసలు విషయం వెలుగులోకి వస్తుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. పోర్జరీ జరిగిందని మంత్రి భావిస్తూ ఉంటే మాత్రం, ఇది చాలా తీవ్రస్థాయి నేరం అవుతుందని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభిప్రాయపడ్డారు.
హమాస్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించాలని ఇజ్రాయెల్ భారత్‌ను అభ్యర్థించింది. ఆ దిశగా భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం మరింత పెరగడంపై మాత్రం భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోంది.