Congress MP Dheeraj
Kumar Sahu: ఆదాయపు పన్ను శాఖ పశ్చిమబెంగాల్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ లో జరిపిన సోదాల్లో రూ. 290 కోట్ల నగదు స్వాధీనం చేసుకుంది. ఈ మొత్తం ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు
చెబుతున్నారు. మరికొన్ని చోట్ల అక్రమంగా నగదును దాచారనే సమాచారం అందడంతో సోదాలు
కొనసాగిస్తున్నారు.
జార్ఖండ్,
పశ్చిమబెంగాల్ లో ఒడిశాకు చెందిన డిస్టిలరీ కార్యాలయాల్లో ఐటీ అధికారులు తనిఖీలు
నిర్వహించగా లెక్కలు చూపని నగదు వెలుగులోకి వచ్చింది.
ఆదాయ
పన్ను శాఖ అధికారులు చెబుతున్న వివరాల ప్రకారం, మరో మూడు ప్రాంతాల్లోని ఏడు
గదుల్లో తనిఖీలు చేయాల్సి ఉందన్నారు. తొమ్మిది లాకర్లు తెరవాల్సి ఉందన్నారు.
ఆల్మరాలతో పాటు ఫర్నిచర్ లో నగదును దాచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. నగలు, నగదు
ఉంచిన ప్రాంతాల గురించి తమకు పక్కా సమాచారం అందిందన్నారు.
నేడు
బౌధ్ డిస్టలరీతో పాటు దాని అనుబంధ కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయని
ఆదాయపన్ను శాఖ స్పష్టం చేసింది. బల్దేవ్
సాహూ ఇన్ ఫ్రా కంపెనీతో పాటు ఓ బియ్యం మిల్లులో రైడ్స్ జరుగుతున్నాయి.
జార్ఖండ్‌కు
చెందిన కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ కుమార్ సాహూ వ్యాపార సంస్థల నుంచి కోట్ల రూపాయల నగదు
స్వాధీనం చేసుకున్నారు.
ఎంపీ
ధీరజ్ వ్యాపార సంస్థల్లో ఐటీ సోదాలపై స్పందించిన ప్రధాని, ప్రజల్ని నుంచి దోచుకున్న
ప్రతీ రూపాయిని వెనక్కి ఇవ్వాల్సిందేనంటూ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. దేశం
మొత్తం ఈ ఘటనను చూస్తోందని, సదరు నాయకుల ప్రసంగాల్లోని నిజాయితీ తేటతెల్లం
అవుతుందంటూ చురకలు అంటించారు.
ఈ అంశంపై
సమగ్ర దర్యాప్తు కోసం సీబీఐతో విచారణ చేపట్టాలని ఒడిశా బీజేపీ శాఖ డిమాండ్ చేస్తోంది.
అధికార బీజేడీ స్పందించాలని కోరింది.