‘అస్సాం
ఒకప్పుడు మయన్మార్ లో భాగమని’ సుప్రీంకోర్టు న్యాయవాది, ఎంపీ కపిల్ సిబల్ చేసిన
వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ
కూడా సిబల్ పై మండిపడ్డారు.
1955
పౌరసత్వ చట్టంలోని సెక్షన్ 6ఏ చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల పై
సర్వోన్నత న్యాయస్థానంలో వాదనలు వినిపించిన కపిల్ సిబల్, వలసలపై ఎలాంటి రికార్డులు
ఉండవని, అస్సాం చరిత్రను చూస్తే ఎవరు ఎప్పుడు వచ్చారనేది గుర్తించడం సంక్లిష్టమైనదన్నారు.
అస్సాం ఒకప్పుడు మయన్మార్ లో భాగమని 1824లో ఆంగ్లేయులతో చేసుకున్న ఒప్పందం మేరకు
అస్సాంను మయన్మార్ వారికి అప్పగించిందన్నారు.
సిబల్
సుప్రీంకోర్టులో చేసిన వాదనలు ఖండించిన బిశ్వంత శర్మ, అస్సాం చరిత్ర గురించి
తెలియకుండా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. అస్సాం ఎప్పుడూ మయన్మార్ లో భాగం
కాదన్నారు. కొంత కాలం ఈ అంశం వివాదస్పదమైనప్పటికీ దానికి సంబంధించిన ఆధారాలు
ఎక్కడా లేవని స్పష్టం చేశారు.