ఇజ్రాయెల్ హమాస్ ఉగ్రవాదుల మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసేలా లేదు. కాల్పుల విరమణకు కొన్ని దేశాలు చేసిన ప్రయత్నాలు ఫలించినా దీర్ఘకాలం కొనసాగలేదు. ఇజ్రాయెల్ మరలా గాజాలో భీకరదాడులకు దిగుతోంది. అక్కడ ప్రజాజీవనం అస్తవ్యస్తం అయిందని, వెంటనే కాల్పుల విరమణ జరగాలంటూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన డిమాండ్‌ను అమెరికా వ్యతిరేకిస్తూ వీటో పవర్ ఉపయోగింది.
గాజాలో వెంటనే కాల్పుల విరమణ జరపాలంటూ ఐరాస భద్రతా మండలి తీర్మానానికి అనుకూలంగా 13 మంది ఓటేశారు. ఇంగ్లండ్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. గాజాలో మానవ సంక్షోభం నివారణ కోసం అక్కడ వెంటనే కాల్పుల విరమణ జరగాలని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ తన అసాధారణ అధికారం ఉపయోగించారు. యూఎన్ చార్టర్‌లోని 99ను ఉపయోగించారు. ప్రత్యేక అధికారంతో అత్యవసరంగా ఐరాసను సమావేశ పరిచారు. కాల్పుల విరమణపై జరిగిన ఓటింగ్‌లో మండలిలోని 15 సభ్య దేశాలుండగా… 13 అనుకూలంగా ఓటేశాయి. బ్రిటన్ ఓటింగ్‌కు దూరంగా ఉంది. అమెరికా వీటో ఉపయోగించింది.