world’s most popular leader:
ప్రపంచంలో కెల్లా అత్యధిక ప్రజాకర్షక
నేతగా ప్రధాని నరేంద్ర మోదీ(PM MODI ) ఘనత
సాధించారు. మోదీ నాయకత్వంపై దేశవ్యాప్తంగా 76 శాతం ప్రజలు హర్షం వ్యక్తం
చేస్తుండగా, 18 శాతం మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారు. అమెరికాకు చెందిన మార్నింగ్
కన్సల్ట్ సంస్థ నిర్వహించిన తాజా సర్వేలో ఈ విషయం తేలింది.
దేశవిదేశాల్లో
మోదీకి మంచి ఫాలోయింగ్ ఉంది. ఆయన విదేశీ పర్యటనకు వెళ్లినప్పుడు ప్రవాస భారతీయులు పెద్ద
ఎత్తున తరలివచ్చి స్వాగతం పలుకుతున్నారు. సోషల్ మీడియాలో సైతం ఆయన హవా
కొనసాగుతోంది.
మోదీ
తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రేడర్
ఉన్నారు. ఆయన నాయకత్వాన్ని 66 శాతం మెక్సికన్లు సమర్థిస్తున్నారు. 29 శాతం మంది
వ్యతిరేకిస్తున్నారు.
మూడో స్థానంలో స్విట్జర్లాండ్ అధ్యక్షుడు అలైన్ బెరైట్ , నాలుగో
స్థానంలో బ్రెజిల్ అధ్యక్షుడు లులా డ సిల్లా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనీస్
ఐదో స్థానంలో ఉన్నారు.
అత్యంత తక్కువ వ్యతిరేకత ఎదుర్కొంటున్న నేత కూడా
మోదీనే కావడం విశేషం.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను అత్యధికంగా 58 శాతం మంది
వ్యతిరేకిస్తున్నారు.