ఐసిస్ ఉగ్రవాదుల కేసులో జాతీయ భద్రతా సంస్థ ఎన్‌ఐఏ మహారాష్ట్ర, కర్ణాటకలోని దాదాపు 40 ప్రాంతాల్లో ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తోంది. థానే, పూనే, మిరా బయాందర్ ప్రాంతాల్లో ఈ దాడులు జరుగుతున్నాయి. థానే గ్రామీణ ప్రాంతాల్లోనే 31 చోట్ల ఎన్‌ఐఏ సోదాలు నిర్వహిస్తోంది. థానేలో 9 ప్రాంతాల్లో దాడులు చేస్తున్నారు.
ఆకిఫ్ అతీఖ్ నచన్‌ను పేలుడు పదార్థాల తయారు చేస్తున్నాడనే అనుమానంతో గత ఆగష్టులో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఆ కేసులో ఇప్పటికే ఐదుగురిని జాతీయ భద్రతా సంస్థ అరెస్ట్ చేసింది.వీరిలో తబిక్ నసీర్ సిద్దిఖీ, జుబైర్ నూర్ మహ్మద్ షేక్ అలియాస్ అబు నుసైబా, అద్నాన్ సర్కార్, షార్జీల్ షేక్, జుల్ఫికర్ అలి బరోదవాలాలను గత నెలలో ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.