జోరామ్
నేషనలిస్ట్ పార్టీ(znp) అధినేత లాల్ దుహోమా మిజోరం
ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. మిజోరం రాజధాని ఐజ్వాల్ లోని రాజ్భవన్లో
గవర్నర్ కంభంపాటి హరిబాబు అధ్యక్షతన ఈ ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. సీఎంతో
పాటు ఏడుగురు మంత్రులు, నలుగురు సహాయ మంత్రులు కూడా ప్రమాణంస్వీకారం చేశారు.
లాల్
దుహోమా ఈ ఎన్నికల్లో సెర్చిప్ నియోజకవర్గం(Serchhip
constituency)
నుంచి ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. ఆయనకు మొత్తం 8314 ఓట్లు పడగా రెండోస్థానంలో
అభ్యర్థి కంటే 2892 ఓట్లు అధికంగా సాధించారు.
లాల్
దుహోమా(74) గతంలో ఐపీఎస్ గా పనిచేశారు. ఆయన 1977 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. సర్వీసులో
భాగంగా 1982లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీకి భద్రతా అధికారిగా వ్యవహరించారు.
ఐపీఎస్ కు రాజీనామా చేసిన తర్వాత 1984 లో కాంగ్రెస్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.
1988లో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయారు. తర్వాత
కాంగ్రెస్ కు రాజీనామా చేశారు.
1986లో
మిజోరాం శాంతి ఒప్పందంలో కీలక పాత్ర పోషించడంతో పాటు తిరుగుబాటును అణిచివేయడంలో
లాల్దుహోమ కీలకంగా వ్యవహరించారు. తర్వాత మిజో నేషనల్ ఫ్రంట్ ను స్థాపించారు.
1977లో దానిన జోరామ్ నేషనలిస్ట్ పార్టీగా మార్చారు. 2003లో ఆ పార్టీ నుంచి
ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.
ఆరు
పార్టీల విలీనంతో ఏర్పడిన జోరామ్ పీపుల్స్ మూమెంట్ లో పార్టీలో జోరామ్ నేషనలిస్ట్ పార్టీ విలీనమైంది.
కానీ దానిని ఎన్నికల సంఘం గుర్తించకపోవడంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా శాసనసభకు
ఎన్నికయ్యారు. 2020లో కూడా ఆయన ఎమ్మెల్యే పదవికి అనర్హులయ్యారు. 2021 లో జరిగిన ఉప
ఎన్నికల్లో ZPM అభ్యర్థిగా సెర్చిప్ నియోజకవర్గం నుంచి
బరిలో నిలిచి విజయం సాధించారు.
మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో జోరామ్
నేషనలిస్ట్ పార్టీ 27 స్థానాల్లో విజయం సాధించగా మిజో నేషనల్ ఫ్రంట్ 10
స్థానాల్లోనే నెగ్గింది.