పార్లమెంట్లో ప్రశ్నలు వేసినందుకు డబ్బు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటోన్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాపై బహిష్కరణ వేటు పడింది. ఈ వ్యవహారంలో పార్లమెంట్ నైతిక విలువల కమిటీ ఇచ్చిన నివేదికను ఇవాళ ఉదయం లోక్సభలో ప్రవేశపెట్టారు. తరవాత దీనిపై గంటకుపైగా చర్చ జరిగింది. తదనందరం ఓటింగ్ నిర్వహించారు. కమిటీ నివేదికను లోక్సభ ఆమోదించడంతో మహువాను సభ నుంచి బహిష్కరిస్తున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు.