లోక్సభలో
ప్రశ్నలు అడిగేందుకు డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ
మహువా మొయిత్రా పై పార్లమెంట్ ఎథిక్స్ కమిటీ అందజేసిన నివేదిక, లోక్సభ ముందుకు
వచ్చింది. బీజేపీ, ఎంపీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ విజయ్ సోన్కర్ లోక్ సభలో దీనిని ప్రవేశపెట్టారు.
లోక్సభ
నియమావళికి వ్యతిరేకంగా ఆమె వ్యవహరించినందున మహువా ఎంపీ సభ్యత్వాన్ని రద్దు
చేయాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది.
ఎథిక్స్
నివేదిక కమిటీ నివేదిక కాపీలను తమకు ఇవ్వాలంటూ ప్రతిపక్ష సభ్యులు నిరసన వ్యక్తం
చేశారు. ఈ విషయంపై ఓటింగ్ జరగడానికి ముందు చర్చ జరపాలని నినదించారు. సమావేశాలకు
అంతరాయం కల్పించడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.
ఈ నివేదికను లోక్సభ ఆమోదిస్తే
మహువా, బహిష్కరణకు గురవుతారు.
లోక్సభ ప్రారంభానికి ముందు మీడియాతో మాట్లాడిన మహువా,
‘ వినాశనం సంభవించినప్పుడు తొలుత కనుమరుగు అయ్యేది వివేకమే, మహాభారత యుద్ధాన్ని’
చూస్తారంటూ వ్యాఖ్యానించారు.