మైనారిటీ
వర్గానికి చెందిన చేనేత కార్మికుడు ఆత్మహత్యకు యత్నించాడు. అప్పు చెల్లించాలంటూ
బెదిరింపులకు తోడు కుటుంబసభ్యులను కించపరిచేలా పరుషంగా మాట్లాడటంతో తీవ్ర ఆవేదన
చెంది బలవన్మరణనానికి యత్నించడాడని బాధితుడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. భార్యను
విక్రయించైనా అప్పు చెల్లించాలంటూ అవమానించారని వాపోతున్నారు. ఈ ఘటన
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో చోటుచేసుకుంది.
ధర్మవరం
శాంతినగర్ కు చెందని ఇలియాజ్, మగ్గం వేస్తూ చీరల వ్యాపారం చేస్తుంటాడు. అదే ప్రాంతానికి
చెందిన వైసీపీ వర్గీయులైన తేజ, బాలకృష్ణ వద్ద 20 పట్టు చీరలు తీసుకన్నాడు. అయితే
వాటిలో ఆరుమాత్రమే అమ్ముడుపోగా మిగతావాటిని వెనక్కి ఇస్తానని చెప్పాడు. ఈ విషయంలో అధికారపార్టీకి
చెందిన నాయకుల సమక్షంలో పంచాయితీ జరిగిందని వారంతా తన భర్తను బెదిరించారని
బాధితుడి బార్య చెబుతోంది.
పోలీసు స్టేషన్ లో కేసు కూడా నమోదైందని ఆ మేరకు అమ్ముడుపోని
చీరలను వెనక్కి ఇచ్చినట్లు తెలిపింది.
ఆ
తర్వాత మళ్ళీ తమను వేధించడం మొదలు పెట్టారని రూ. 7లక్షలు విలువైన 41 చీరలు వెనక్కి
ఇవ్వాలంటూ బలవంతంగా సంతకాలు చేయించుకోవడంతో పాటు భార్యను విక్రయించి అయినా అప్పు
చెల్లించాలంటూ అవమానించారని వాపోతుంది.
వైసీపీ నేతల బెదిరింపులతో పాటు పరుషపదజాలంతో
దూషించడంతోనే తన భర్త విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడని , తనకు న్యాయం చేయాలని
ప్రాథేయపడుతోంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది.