India
bans onion exports:
ఉల్లి
ధరలు మళ్ళీ పెరిగాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో కేజీ ఉల్లిపాయల ధర రూ. 50 పైనే
పలుకుతుంది. దీంతో వచ్చే ఏడాది మార్చి ఆఖరు వరకు ఉలి ఎగుమతులుపై కేంద్రం నిషేధం
విధించింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
దేశీయంగా
ఉల్లిపాయలు అందుబాటులో ఉంచడంతో పాటు ధరలు అదుపుచేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు
తెలిపారు. నేటి నుంచే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని కేంద్రం తెలిపింది.
ఇతర
దేశాల నుంచి అభ్యర్థన వస్తే అందుకు కేంద్రం అనుమతిస్తే ఆయా దేశాలకు ఎగుమతులు
చేసుకోవచ్చు అని స్పష్టం చేసింది. ఇప్పటికే లోడ్ చేసి ఉన్న వాటిని సరఫరా చేసేందుకు
ఎలాంటి అభ్యంతరం ఉండదని స్పష్టం చేసింది.
దేశీయ
మార్కెట్లలో ఉల్లిధరలను అదుపు చేసేందుకు ఇటీవల కేంద్రం పలుమార్లు ఎగుమతులపై పాలసీని
సవరించింది. ఆగస్టులో ఉల్లి ఎగుమతులపై 40 శాతం పన్ను విధించింది. ఆ తర్వాత దానిని
సవరిస్తూ ఉల్లికి కనీస ఎగుమతి ధరను టన్నుకు 800 డాలర్లుగా నిర్ణయించింది.