భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (isro) వచ్చే ఏడాది కీలక ప్రయోగాలు చేపట్టడానికి సిద్దమవుతోంది. 2024లో 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిల్లో ముఖ్యంగా 6 పీఎస్ఎల్వీ ప్రయోగాలతోపాటు, 3 జీఎస్ఎల్వీ, ఒక లాంచ్ వెహికల్ మార్క్- 3 మిషన్ ఉన్నట్లు రాజ్యసభలో వెల్లడించారు.
ఇస్రో తాజాగా అభివృద్ధి పరచిన సరికొత్త ప్రయోగ వాహక నౌక ఎస్ఎస్ఎల్వీ ( స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్) ద్వారా ప్రయోగాత్మకంగా ఓ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్నారు. రోదసీలోకి వ్యోమగాములను పంపేందుకు గగన్‌యాన్ పేరుతో భారత్ ప్రతిష్ఠాత్మక మిషన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే.అత్యవసర పరిస్థితుల్లో వ్యోమగాములు సురక్షితంగా బయట పడేందుకు ఇటీవల పరీక్షించిన క్రూ ఎస్కేప్ సిస్టమ్‌ను ధ్రువీకరించేందుకు మరో ప్రయోగం చేయనున్నట్లు కేంద్ర సహాయమంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు.