అనంతపురం జిల్లాలో అరాచకం వెలుగు చూసింది. కలెక్టరేట్లోని వేదికను ఓ మహిళా అధికారి క్రైస్తవ మత ప్రచారానికి వినియోగించుకున్నారు. గురువారం అనంతపురం
కలెక్టరేట్లో ఉన్నతి మహిళా శక్తి పథకాన్ని జేసీ కేతన్ గార్గ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. అధికారులు వెళ్లిపోగానే ఓ మహిళా అధికారి అదే వేదికపై మహిళలకు బైబిళ్లు పంచడం ప్రారంభించారు. కొందరు వాటిని తీసుకోగా మరికొందరు తిరస్కరించారు.
బైబిల్ పుస్తకాలు పంచి వారితో ఫోటోలు దిగిన సదరు మహిళా అధికారి నిర్వాకంతో ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. సమావేశం తరవాత వేదికను వాడుకుని ఉండిఉండే చర్యలు తీసుకుంటామంటూ డీఆర్డీఏ పీడీ నరసింహారెడ్డి ప్రకటించారు. సదరు మహిళా అధికారిని వివరణ కోరగా తనకు సంబంధం లేదని, కొందరు మత ప్రచారకులు వచ్చి బైబిల్ పుస్తకాలు పంచారని చెప్పడం విశేషం.