Atrocities on Hindus in Bangladesh two years before Ayodhya Karseva
6 డిసెంబర్ 1992… హిందూ సంస్థలు ‘శౌర్యదివస్’గా
జరుపుకునే రోజు. హిందూ వ్యతిరేక ముఠాలు మాత్రం ఆరోజు హిందువులు మరో మతపు ప్రార్థనాస్థలాన్ని
కూల్చివేసారని ప్రచారం చేస్తుంటారు. ఆ ప్రచారాన్ని చాలామంది హిందువులు నమ్ముతారు
కూడా. కానీ నిజమేంటంటే ఇస్లామిక్ ఆక్రమణదారులు అయోధ్యలోని రామమందిరాన్ని ధ్వంసం
చేసి దానిమీద వివాదాస్పద నిర్మాణాన్ని కట్టారు. విచిత్రమేంటంటే, ఈ వామపక్ష ఉదారవాద
ముఠాలు, రామమందిరం కోసం భారతదేశంలో పోరాటం జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్‌లో
హిందువుల మీద జరిగిన అత్యాచారాల విషయంలో మౌనంగా ఉండిపోతారు.
శ్రీరామజన్మభూమిలో రామమందిరం కోసం హిందువులు
5శతాబ్దాలు పోరాడారు. న్యాయ మార్గంలో ఎంతో శ్రమించి ఎన్నో త్యాగాలు చేసి ఎట్టకేలకు
తమ హక్కు సాధించుకున్నారు. కానీ ఇస్లామిక్ మూకకు అలాంటి నియమాలూ నిబంధనలూ ఏమీ
లేవు. అయోధ్యలో రామమందిరం కోసం భారతీయ హిందువులు పోరాడుతున్న సమయంలో పొరుగునే ఉన్న
బంగ్లాదేశ్‌లో ఆ సాకుతో హిందువులపై సాగించిన అఘాయిత్యాలు అన్నీ ఇన్నీ కావు. వేలాది
మంది హిందూ మహిళలపై అత్యాచారాలు చేసారు. వేలాది దేవాలయాలను విధ్వంసం చేసారు. విషాదమేంటంటే,
అయోధ్యలో తమ మసీదును పడగొట్టారన్న పుకార్లు వ్యాప్తి చేసి, ఆ దురాగతాలకు
పాల్పడ్డారు.
1989 నవంబర్ 2. అయోధ్యలోని వివాదాస్పద స్థం వద్ద
రామమందిర నిర్మాణానికి ప్రతీకాత్మకంగా కరసేవ జరిగిన మొదటి రోజు. ఆ సమాచారం చేరగానే
బంగ్లాదేశ్‌లో హింసాకాండ మొదలైపోయింది.
1990 అక్టోబర్‌లో, అంటే అయోధ్యలో వివాదాస్పద
కట్టడం కూల్చివేతకు 26 నెలల ముందుగానే, బంగ్లాదేశీ మీడియా పుకార్లను వ్యాప్తి
చేసింది. భారతదేశంలో వివాదాస్పద బాబ్రీ కట్టడాన్ని కూల్చేసారంటూ అబద్ధపు ప్రచారం
చేసింది. బంగ్లాదేశ్‌లో అప్పటి రాజకీయ వాతావరణం కూడా అలాగే ఉండేది. 1988లో అప్పటి
నియంతృత్వ అధ్యక్షుడు హుసేన్ మొహమ్మద్ ఎర్షాద్, ఇస్లాంను బంగ్లాదేశ్ అధికారిక
మతంగా ప్రకటించాడు.
1990 అక్టోబర్ 30న ఎర్షాద్ ‘బంగ భవన్’లో ఒక యువ
సమ్మేళనాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్నాడు. తాను అధికారంలో ఉన్నకాలంలో మైనారిటీల
పట్ల ఎలాంటి హింసా జరగదని తన ప్రసంగంలో చెబుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో ముస్లిం
మత ఛాందసవాద మూక హిందువుల దుకాణాలను లూటీ చేస్తున్నారు. అధ్యక్షుడు ఎర్షాద్
ప్రసంగిస్తున్న ‘బంగ భవన్’కు దక్షిణంగా కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న ‘గౌరీమఠ్’ను
లక్ష్యం చేసుకున్నారు. హిందువుల ఆస్తులను తగలబెట్టేసారు. ఆ విధ్వంసం అంతా పోలీసులు
చూస్తుండగానే జరిగిందని ‘హ్యూమన్ రైట్స్ కాంగ్రెస్ ఫర్ బంగ్లాదేశ్ మైనారిటీస్’
సంస్థ తన నివేదికలో స్పష్టంగా చెప్పింది.
1989-90 కాలంలో బంగ్లాదేశ్‌లో హిందువులపై సాగిన
హింసాకాండను మామూలు అల్లర్లుగా పరిగణించలేమని ఆ నివేదిక కుండబద్దలుకొట్టింది.
ఎందుకంటే, అచ్చం 1964లో లాగానే, అప్పుడు జరిగిన హింస కూడా ఒకేఒక్క పార్టీ చేయించింది.
అప్పుడు అధికారంలో ఉన్న పార్టీయే ఆ అరాచకాలకు కారణమైంది. 1992లో జరిగిన హింసకు
కారణం, అప్పటి అధికార పక్షం బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి మిత్రపక్షమైన ‘జమాతే
ఇస్లామీ’యే అని ఆ నివేదిక వివరించింది.
హ్యూమన్ రైట్స్ నివేదిక ప్రకారం 1989-90 ఒక్క
యేడాదిలోనే వెయ్యిమందికి పైగా హిందూ మహిళలను రేప్ చేసారు. వందలాది దేవాలయాలను
నేలమట్టం చేసారు. హిందూ మైనారిటీల ఇళ్ళను లూటీ చేసారు, తగలబెట్టేసారు.
ఇంక 1992 డిసెంబర్ 6 నాటి రాత్రి అయితే
చిట్టగాంగ్‌లోని హిందువుల కుటుంబాలు ముస్లిముల దాడుల్లో చిగురుటాకుల్లా వణికిపోయాయి.
కుతుబ్దియాలో ముగ్గురు చిన్నారులను సజీవంగా దహనం చేసారు. ఆ తర్వాత హింసాకాండ దేశ
రాజధాని ఢాకాకు, ఇతర నగరాలకూ వ్యాపించింది.
హిందూ బుద్ధిస్ట్ క్రిస్టియన్ యూనిటీ కౌన్సిల్
(హెచ్బీసీయూసీ) క్షేత్రస్థాయిలో పర్యటించి, జరిగిన నష్టాన్ని లెక్కకట్టి ఒక
నివేదిక రూపొందించింది. హిందువులకు చెందిన 28వేల ఇళ్ళు, 3,500 గుడులు లేక ప్రార్థనా
స్థలాలు, 2500 దుకాణాలూ ధ్వంసమయ్యాయని ఆ నివేదిక వెల్లడించింది. పాత ఢాకాలోని
శంకరీ బజార్లో ఒక్క హిందూ దుకాణమైనా మిగల్లేదు. సిలెట్ జిల్లాలో హిందువులను
చిత్రహింసల పాలుచేసారు. అయితే, ఆ నివేదికలో వెల్లడించిన గణాంకాలు చాలా తక్కువ అని
అప్పుడు భోలా ప్రాంత ఎంపీగా ఉన్న తౌఫీద్ అహ్మద్, ఆల్ పార్టీ అలయెన్స్ కార్యదర్శి
నరుల్ ఇస్లామ్ నహీద్ స్పష్టం చేసారు.
హిందూ మహిళలపై సామూహిక అత్యాచారాలు చేసారు.
అంతటితో ఆగకుండా వారిని వీధుల్లో నగ్నంగా నడిపించారు. చిన్నపిల్లలను కూడా
వదల్లేదు. ఐదేళ్ళ చిన్నారులను సైతం రేప్ చేసారు. కొన్ని గ్రామాల్లోనైతే 5ఏళ్ళ
నుంచి 70ఏళ్ళ వయసు వరకూ ఉన్న ఆడవారిని అందరినీ అత్యాచారం చేసారు.
ఆ విధ్వంసకాండలో భాగంగానే ఢాకేశ్వరీదేవి
మందిరాన్ని ధ్వంసం చేసారు. ప్రధాన ఆలయ భాగాన్ని
తగులబెట్టేసారు. ఆ ఘటనను తస్లీమా నస్రీన్ తన ‘లజ్జ’ నవలలో ప్రస్తావించింది. దేవీ
దేవతల వినోదం కోసం నిర్మించిన ‘నటమందిర్’కు నిప్పుపెట్టారు. ఆ ఆలయానికి చేరువలోని
‘శ్రీదామ్ ఘోష్’ను తగలబెట్టేసారు. ‘మాధవ్ గుడియా మఠ్’ను ధ్వంసం చేసేసారు. ‘జయకాళీ
మందిరా’న్నీ వదల్లేదు. బ్రహ్మసమాజం ఆవరణ మొత్తాన్నీ నాశనం చేసేసారు.
దెమ్రాలో ‘శని అఖాడా’ ఆలయాన్ని లూటీ చేసారు.
బృహభద్ర, లోకీబజార్ ప్రాంతాల్లో కన్ను చూడగలిగిన మేర అంతా నాశనం చేసారు.
ఇస్లాంపూర్ రోడ్లో గొడుగులు, ఆభరణాలు అమ్మే దుకాణాలన్నీ దోచేసారు. 300మంది
ఉగ్రవాదులు మూకుమ్మడిగా 25 ఇళ్ళను లక్ష్యం చేసుకుని ధ్వంసం చేసారు. ఆ ఇళ్ళలోని
వారిని చిత్రహింసల పాలుచేసారు. హిందూ దుకాణాల పేర్లను ఉర్దూలోకి మార్చేసారు. తస్లీమా నస్రీన్ ఆ సంఘటనలను తన
‘లజ్జ’ నవలలో వివరించింది. నవాబ్పూర్ రోడ్‌లోని మోరోచాంద్ మిఠాయి దుకాణాన్ని ఎలా
ధ్వంసం చేసారో వివరంగా రాసింది.
రాయర్ బజార్‌లోని కాళీ మాత ఆలయంలో అమ్మవారి
మూలవిరాట్ విగ్రహాన్ని పగలగొట్టి నేల మీద పడేసారు. తాత్రీ బజార్‌లోని బత్తాలీ
ఆలయాన్ని లూటీ చేసి నాశనం చేసారు. నవాబ్పూర్లో కామ్ధొన్ పొషారీ, శుక్లా
మిష్తాన్ భండార్ వంటి దుకాణాలను దోచేసారు. జతిన్ అండ్ కంపెనీ అనే ఫ్యాక్టరీని
తగలబెట్టేసారు. సొదొర్ఘాట్ రోడ్‌లోని రతన్ శంకర్ బజార్‌ను నాశనం చేసారు. నాగదేవత
ఆలయాన్ని నేలమట్టం చేసారు. ‘ఇవేవీ ఘర్షణలు కావు, ఎందుకంటే ఘర్షణలో రెండు వర్గాలూ
కొట్టుకుంటాయి, కానీ ఇవన్నీ ఏకపక్షంగా జరిగిన దాడులు’ అని తస్లీమా నస్రీన్ రాసింది.
ఇదంతా ఒక వర్గంపై మరో వర్గం అణచివేత.
లాల్బాగ్ రోడ్‌లోని దుర్గా మందిరం, పుష్పరాజ్
సాహా లేన్‌లోని గిరిగోవర్ధన్ జీతూ ఆలయం, హరనాథ్ ఘోష్ వీధిలోని రఘునాథ్ అఖాడా, లాల్‌బాగ్‌లోని
కమ్రంగీచార్ శవదహనశాల… అన్నీ 1990లోనే ధ్వంసమైపోయాయి. సూత్రపూర్లో 14
దేవాలయాలను ధ్వంసం చేసారు. ఆ నగరంలోని బెల్తోలీ లేన్‌లో 17మంది హిందువులను పొడిచి
పొడిచి చంపారు. ఇక ఢాకాలోని భారత దౌత్య కార్యాలయాన్ని వేలాది ముస్లిములు చుట్టుముట్టారు.
బంగ్లాదేశ్‌కు విముక్తి కలిగించి, స్వాతంత్ర్యం ఇప్పించి, ఒక దేశంగా మనుగడలోకి
తీసుకొచ్చిన భారతదేశం పట్ల బంగ్లాదేశ్ వ్యవహరించిన తీరు అది. తమను విడిగా ఒక
దేశంగా ఏర్పాటు చేసినందుకు, తమ దేశంలో మైనారిటీలుగా మారిన హిందువులపై, గాలి కబుర్ల
ఆధారంగా బంగ్లాదేశీ ముస్లిములు సాగించిన అత్యాచారాల పరంపర అది.
వివాదాస్పద బాబ్రీ కట్టడం
గురించి గగ్గోలు పెట్టేవారు ఈ విధ్వంసం గురించి ఒక్కసారైనా చెప్పడం మీరెవరైనా
విన్నారా? 1989 నుంచి 1992 మధ్యలో బంగ్లాదేశ్‌లో ముస్లిం మూకలు హిందువులపై దాడులు
చేసి, వారిపై అత్యాచారాలకు పాల్పడి, వారిని హింసల పాలు చేసిన ఘటనల గురించి
ఎవ్వరైనా నోరు మెదిపారా? వీటి గురించి ఎవరూ ఎందుకు మాట్లాడరు?