తెలంగాణలో
కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులుగా మరో 11 మంది
ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శాఖలు కేటాయించారు.
ఉత్తమ్
కుమార్ రెడ్డికి హోం శాఖ బాధ్యతలు అప్పగించిన రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబుకు
ఆర్థిక శాఖ, కోమటిరెడ్డి వెంకటరెడ్డికి మున్సిపల్ శాఖ అప్పగించారు.
ఖమ్మం
జిల్లా పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన పొంగులేటి శ్రీనివాసరెడ్డికి నీటిపారుదల
శాఖ , కొండా సురేఖకు మహిళా సంక్షేమ శాఖ కేటాయించారు.
ఉప
ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రెవెన్యూ శాఖ, దామోదరం రాజనర్సింహకు ఆరోగ్యశాఖ,
జూపల్లి కృష్ణారావుకు పౌరసరఫరాలు, పొన్నం ప్రభాకర్‌కు బీసీ సంక్షేమ శాఖ బాధ్యతలు
అప్పగించారు.
సీతక్కకు గిరిజన సంక్షేమ శాఖ, తుమ్మల నాగేశ్వరరావుకు రోడ్లు, భవనాల
శాఖ కేటాయించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముఖ్య
కార్యదర్శిగా శేషాద్రిని నియమించారు. మరోవైపు ఇంటెలిజెన్స్ ఐజీగా శివధర్ రెడ్డిని
నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు
జారీ చేశారు.