మిగ్‌జాం తుపాను
ప్రభావంతో నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాలు జల దిగ్బంధం కావడంతో స్థానికులు నానా
యాతన పడ్డారు. రోడ్లు కోతకు గురికావడంతో పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో
జనజీవనం స్తంభించింది. ప్రభుత్వ అధికారులతో పాటు పలు సేవా సంస్థలు సహాయ చర్యల్లో ముమ్మరంగా
పాల్గొన్నాయి. బాధితులకు అవసరమైన సాయం అందించాయి.
తుపాను ప్రభావిత
ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్రీయ సేవా సమితి, సేవా భారతి ఫౌండేషన్ సభ్యులకు బాధితులకు సాయం
అందించారు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడం, ఆహారం అందజేత, విరిగిపడిన
చెట్ల తొలగింపు, వైద్య సదుపాయాల కల్పన వంటి విషయాల్లో సేవా భారతి సభ్యులు చేయూత
అందించారు.
నెల్లూరు సేవా భారతి
ఆధ్వర్యంలో మండేవారిపాలెంలోని తుపాను సహాయ పునరావాస కేంద్రంలో నిర్వాసితులకు తాగునీరు, ఆహారం అందజేశారు.
4వ తేది రాత్రి నుంచే సేవా భారతి సభ్యులు
సహాయ కార్యక్రమాలు ప్రారంభించారు. ముంపునకు గురైన సుమారు 10 బస్తీల్లో 3,000 మందికి భోజనం, అల్పాహారం అందజేశారు.
బాపట్ల సేవా భారతి
ఆధ్వర్యంలో తుఫాన్ ప్రభావం అధికంగా ఉన్న కాజీపాలెం అయోధ్య కాలనీలో 70 మందికి భోజనం అందజేశారు.
రహదారులకి
ఇరువైపులా అడ్డంగా ఉన్నటువంటి చెట్లను తొలగించారు. ఈ కార్యక్రమాలలో పెద్ద సంఖ్యలో
స్వయం సేవకులు, సేవా భారతి కార్యకర్తలు పాల్గొన్నారు
వివిధ ప్రాంతాలలోని వారికి సహాయం అందించటం కోసం సేవాభారతి వారి ఆధ్వర్యంలో టోల్
ఫ్రీ నంబర్ విడుదల చేశారు. సాయం కోరిన వారి ప్రదేశానికి తక్షణమే చేరుకుని అవసరమైన చర్యలు
చేపట్టారు.