వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు ఉండటంతో బడ్జెట్లో (central budget) సంక్షేమానికి పెద్ద పీట వేస్తారంటూ వస్తున్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టిపారేశారు. వచ్చే బడ్జెట్లో అద్భుతాలు ఏమీ ఉండకపోవచ్చని ఆమె విలేకరులతో చెప్పారు. తాజాగా ముగిసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ మంచి ఫలితాలు సాధించడంతో, సార్వత్రిక ఎన్నికలపై దృష్టి సారించాయి. ఎన్నికల ముందు బడ్జెట్లో ప్రజాకర్షక పథకాలు, తాయిలాలు ప్రకటించే అవకాశముందనే అంచనాలను కేంద్ర మంత్రి కొట్టిపారేశారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో అద్భతాలు ఏమీ ఉండకపోవచ్చని నిర్మలా సీతారామన్ తెలిపారు. ఢిల్లీలో సీఐఐ ఏర్పాటు చేసిన గ్లోబల్ ఎకనమిక్ పాలసీ ఫోరమ్ సదస్సులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. ప్రభుత్వ ఖర్చుల కోసం మాత్రమే ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు మంత్రి చెప్పారు. వచ్చే బడ్జెట్లో అద్భుతాలు ఉండవని సూచాయగా పేర్కొన్నారు. ఏప్రిల్లో ఎన్నికలు ఉండటంతో వచ్చే ఫిబ్రవరిలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.