విజయవాడ
శ్రీదుర్గామల్లేశ్వర స్వామి ఆలయ మాస్టర్ ప్లాన్ లో భాగంగా పలు అభివృద్ధి పనులకు
సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం వైసీపీ ప్రభుత్వం రూ.
216 కోట్లు ఖర్చు చేయనుంది.
ఇంద్రకీలాద్రికి
చేరుకున్న సీఎం జగన్ కు వేదపండితులు, ఆలయ సిబ్బంది స్వాగతం పలికారు.
దుర్గమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి, అనంతరం దేవాలయ అభివృద్ధి పనులకు భూమిపూజ
చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు ఉన్నతాధికారులు
పాల్గొన్నారు.
దుర్గమ్మ
అన్న ప్రసాద భవన నిర్మాణం కోసం రూ. 30 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, లడ్డూ ప్రసాదం
పోటు భవనం కోసం రూ. 27 కోట్లు వెచ్చించనుంది. కనకదుర్గ నగర్ నుంచి మహామండపం వరకు ఎలివేటేడ్ క్యూ కాంప్లెక్స్ ను
రూ. 23.50 కోట్లతో నిర్మిస్తున్నారు.
రూ.
7.75 కోట్లతో మహారాజ ద్వారం నిర్మాణం చేయనున్నారు.
దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్
కోసం రూ. 23.50 కోట్లు ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేశఖండన శాల
నిర్మాణం కోసం రూ. 19 కోట్లు కేటాయించారు.
ప్రభుత్వ నిధులు రూ.5.60
లక్షలతో చేపట్టిన మల్లేశ్వర స్వామి వారి ఆలయం, రూ.4.25 కోట్లతో ఇంద్రకీలాద్రి కొండ
రక్షణ పనులు, ఎల్టీ ప్యానల్
బోర్డులు, ఎనర్జీ, వాటర్
మేనేజ్మెంట్, స్కాడా పనులు పూర్తి
కావడంతో ముఖ్యమంత్రి వీటిని ప్రారంభించారు.
దేవదాయ శాఖ నిధులు రూ. 3.87
కోట్లతో చేపట్టిన 8
ఆలయాల పునఃనిర్మాణ పనులు పూర్తి కావడంతో ఆయా ఆలయాలను కూడా ప్రారంభించారు.