అమెరికాలో
ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. లాస్ వేగాస్ (Las Vegas)లో బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది. నెవాడా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఓ
ఆగంతకుడు కాల్పులు జరపడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
మరో వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
జూదానికి
అడ్డాగా పిలవబడే లాస్ వేగాస్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రపంచదేశాల నుంచి
ఇక్కడికి జూదం ఆడేందుకు వస్తుంటారు. తుపాకీ కాల్పుల ఘటనలు ఇక్కడ తరచుగా
చోటుచేసుకుంటాయి.
చనిపోయిన వారిలో అనుమానితుడు కూడా
ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థులను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు
చర్యలు చేపట్టారు. క్యాంపస్‌తో పాటు మరో చోట కూడా కాల్పులు జరిగినట్లు
తెలుస్తోంది. దీంతో వర్సిటీతో పాటు సమీపంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా
తాత్కాలికంగా మూసి వేశారు.
కొన్నేళ్లుగా
అమెరికాలోని వివిధ ప్రాంతాల్లో కాల్పుల ఘటనలు తరచూ చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల
మైనేలోని లెవిస్టన్ ప్రాంతంలో ఓ వ్యక్తి జరిపిన కాల్పుల్లో ఏకంగా 22 మంది మృతి చెందారు.