క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ దూసుకెళుతోంది. తాజాగా బిట్ కాయిన్ విలువ 44 వేల డాలర్లకు చేరింది. త్వరలో ఇది 45922 మార్కును దాటుతుందని అంచనా వేస్తున్నారు. గడచిన 24 గంటల్లోనే బిట్ కాయిన్ విలువ 252 డాలర్లు అంటే రూ.21 వేలు పెరిగింది. 2023లో బిట్ కాయిన్ విలువ 50 వేల డాలర్లను దాటిపోతుందని పెట్టుబడిదారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం ఒక్కో బిట్ కాయిన్ విలువ 44 వేల డాలర్లు అంటే రూ.36.6 లక్షలకు చేరింది. ఎలాంటి బేరిష్ ట్రెండ్ లేకుండా బిట్ కాయిన్ విలువ దూసుకెళుతోంది. అయితే గత కొంత కాలంగా బిట్ కాయిన్ విలువ పెరగడంతో, కొంత దిద్దుబాటుకు లోనయ్యే అవకావం లేకపోలేదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
బిట్ కాయిన్ తరవాత క్రిప్టో మార్కెట్లో ప్రాచుర్యం పొందిన ఈథర్ ఎటువంటి లాభాలను పొందలేదు. ప్రస్తుతం ఈథర్ 2250 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక పాలిగాన్, పోల్కాడోట్, షిబా ఇను, లియో, స్టెల్లార్, మోనెరో కూడా స్వల్ప లాభాలను పొందాయి. నిపుణుల అంచనా ప్రకారం ప్రస్తుతం క్రిప్టో మార్కెట్ 1.6 ట్రిలియన్ డాలర్లుగా ఉంది.