ఖలిస్థానీ
వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ కేసును విచారించేందుకు జాతీయ దర్యాప్తు
సంస్థ(NIA) సిద్ధమవుతోంది. ఫెడరల్ బ్యూరో ఆఫ్
ఇన్వెస్టిగేషన్ డైరక్టర్ క్రిస్టోఫర్ వ్రే, వచ్చే వారం భారతలో పర్యటించనున్నారు.
వ్రే పర్యటన సందర్భంగా అమెరికా దౌత్య, దర్యాప్తు సంస్థల అధికారులతో భారత అధికారులు
ఈ విషయాన్ని చర్చించబోతున్నారు.
ఎఫ్‌బీఐ
చీఫ్ వ్రే , తన పర్యటనలో భాగంగా దిల్లీలో సీబీఐ, ఎన్ఐఏ అధికారులతో భేటీ అవుతారు.
భారత్ లోని అమెరికా రాయభారి ఎర్రిక్ గార్సెట్టీ ఈ విషయాన్ని వెల్లడించారు.
ఖలీస్థానీ
వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు భారతీయ అధికారి కుట్ర చేశారనే
ఆరోపణలు నేపథ్యంలో ఎఫ్‌బీఐ చీఫ్ భారత పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్య కుట్ర
కేసులో నిందితుడికి భారత అధికారితో సంబంధం ఉన్నట్లు వచ్చిన ఆరోపణలను విదేశాంగశాఖ
ప్రతినిధి అరిందమ్ బాగ్చి ఖండించారు. ఇది తమ దేశ విదేశాంగ విధానానికి
విరుద్ధమన్నారు. ఈ అంశంపై ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటు చేశామని తెలిపారు.