తిరుమలలో ముగ్గురు విద్యార్ధులు ఒకేసారి అదృశ్యమైన ఘటన (students missing case) సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకుని 24 గంటల్లోనే ఛేదించారు. తిరుమల నుంచి కనిపించకుండా పోయిన విద్యార్ధులను కామారెడ్డి రైల్వే స్టేషన్‌లో గుర్తించారు. వారిని పట్టుకుని తిరుపతి తరలించి, తల్లిదండ్రులకు అప్పగించారు.
ఏడో తరగతి చదువుతోన్న ముగ్గురు విద్యార్ధులు నిన్న సాయంత్రం తిరుమలలో అదృశ్యం అయ్యారు. ఆర్బీసీ సెంటర్‌లో నివాసముండే ఎస్.కృష్ణ కుమారుడు చంద్రశేఖర్, యోగేష్ కుమారుడు వైభవ్, శ్రీవర్థన్ ఎస్వీ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నారు. మధ్యాహ్నం భోజన సమయంలో ఇంటికి వెళ్లి, పరీక్షకు హాజరుకాలేదు. ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఎక్కడ గాలించినా వారు కనిపించలేదు. తల్లిదండ్రులు పోలీసులకు సమాచారం అందించారు. సీసీ కెమెరాల్లో పరిశీలించగా వారు తిరుమల నుంచి ల్యాప్ ట్యాప్‌లతో తిరుపతి చేరుకున్నట్టు గుర్తించారు.అక్కడ నుంచి వారు కామారెడ్డి చేరుకున్నట్టు గుర్తింపు పట్టుకున్నారు.