తెలంగాణ సీఎల్పీనేత రేవంత్ రెడ్డి
కాసేపట్లో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. హైదరాబాద్ ఎల్బీస్టేడియంలో
జరుగుతున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు ఆ పార్టీ
కార్యకర్తలు పెద్దసంఖ్యలో హాజరుకానున్నారు.
ఇక ప్రభుత్వ ఏర్పాటులో కీలకఅంకమైన
మంత్రిమండలి కూర్పుపై కూడా రేవంత్ రెడ్డి ముమ్మర కసరత్తు చేశారు.
సామాజిక సమతూకంతో
పాటు సీనియర్లకే మంత్రవర్గంలో చోటు కల్పిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి
మంత్రివర్గంలో ముగ్గురికి చోటు దక్కనుంది. మల్లుబట్టి విక్రమార్క, తుమ్మల
నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కి కేబినెట్ బెర్త్ కన్ఫామ్ అయినట్లు ఆ
పార్టీ వర్గాలు చెబుతున్నారు. సీతక్క, కొండ సురేఖకు కూడా రేవంత్ రెడ్డి ఫోన్ చేసి
మంత్రివర్గ విస్తరణ గురించి వివరించినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన
సీనియర్లు ఉత్తమ్ కుమర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కాసేపట్లో
మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, దామోదరం రాజనర్సింహం, జూపల్లి
కృష్ణారావుకి రేవంత్ కేబినెట్ లో చోటు దక్కింది.
ప్రమాణస్వీకర కార్యక్రమంలో సోనియా, రాహుల్ గాంధీ
పాల్గొంటున్నారు. రాష్ట్రేతర కాంగ్రెస్ నేతలు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నారు.
ప్రియాంక గాంధీని కూడా రేవంత్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆమె కూడా హాజరయ్యే అవకాశం
ఉంది.
కార్యక్రమంలో దాదాపు లక్షమంది పాల్గొంటారని కాంగ్రెస్ ముఖ్యనేతలు అంచనా
వేస్తున్నారు
ఎల్బీ స్టేడియంలో మూడు వేదికలను ఏర్పాటు
చేశారు. ప్రధాన వేదికపై ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుండగా, ఎడమవైపున ఉన్న
వేదికపై 63 మంది కాంగ్రెస్
ఎమ్మెల్యేలకు సీట్లు కేటాయించారు. కుడి వైపున ఉన్న వేదికపై 150 సీట్లను ఏర్పాటు చేసి
వీవీఐపీలకు కేటాయించారు. వేదిక కింద అమరవీరుల కుటుంబాల కోసం 300 సీట్లతో మరో
గ్యాలరీని, ఉద్యమకారుల కోసం 250
సీట్లతో మరో గ్యాలరీని ఏర్పాటు చేశారు.
ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత రేవంత్రెడ్డి నేరుగా సచివాలయానికి చేరుకుని..
తన చాంబర్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారు.