వాలంటీర్ల అరాచకాలు పెచ్చుమీరిపోతున్నాయి. డబ్బుల కోసం రైల్వే కోడూరులో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన కేసు వివరాలను పోలీసులు మీడియాకు వెల్లడించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం ఇసుకపల్లెకు చెందిన వెంకటేష్, ఇటీవల రైల్వే కోడూరుకు పరిధిలోని జంగిటివారిపల్లెకు చెందిన యువతని వివాహం చేసుకున్నాడు. ఈ నెల 2వ తేదీన అత్తారింటికి వెళ్లాడు.3వ తేదీ నుంచి కనిపించకుండా పోయాడు. అత్తమామలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
వెంకటేష్‌కు కడప జిల్లా కమలాపురానికి చెందిన ఆశా కార్యకర్తతో పరిచయం ఏర్పడింది. తరచూ ఫోన్లో మాట్లాడుకునే వారు.ఈ నెల 3న కడపకు రప్పించిన ఆశావర్కర్, వాలంటీర్ నవీన్, అతని స్నేహితుల సాయంతో కిడ్నాప్ (crime news) చేయించింది. అనంతరం డబ్బులు డిమాండ్ చేశారు. డబ్బులిస్తేనే వదిలేస్తామంటూ బెదిరింపులకు దిగారు. పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా కేసును ఛేదించారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించారు.