తుపాను
ప్రభావానికి గురైన జిల్లాల్లో ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. వాన
తెరిపి ఇవ్వడంతో రైతులు ముంపునకు గురైన పంటలను కాపాడుకునే పనిలో నిమగ్నమయ్యారు.
వ్యవసాయశాఖ
అధికారులతో పాటు ఆర్బీకే సిబ్బంది గ్రామాల్లో పర్యటిస్తూ రైతులకు సలహాలు, సూచనలు అందజేస్తున్నారు.
ప్రభుత్వం
రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసే ప్రక్రియనను చేపట్టింది.
పశ్చిమగోదావరి
జిల్లాలో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఏలూరు జిల్లాలో 68 వేల 55 ఎకరాల్లో
వరిపంట దెబ్బతిన్నట్లు రైతు సంఘాల నేతలు చెబుతున్నారు.
భీమిలి
నియోజకవర్గం పరిధిలోని 500 ఎకరాల్లో వరిపంటకు నష్టం వాటిల్లినట్లు అధికారులు
ప్రాథమికంగా గుర్తించారు. పరవాడ మండలంలో 40 ఎకరాల్లో కోత దశకు వచ్చిన వరి పంట నీటిపాలైంది.
ఉమ్మడి
గుంటూరు జిల్లా కర్షకులకు మిగ్ జాం కన్నీళ్ళే మిగిల్చింది. వరి, మిరప, పొగాకు, శనగ, పత్తి, మినుము, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి.
ఎకరం
మిర్చి సాగు చేసేందుకు రూ.1.5లక్షలు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న రైతులు, తుపాను
దెబ్బకు తాము తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయామని చెబుతున్నారు. డిసెంబరు
నెలాఖరు నుంచి కోతలు ప్రారంభం అవుతాయి.
కాకుమాను, వట్టిచెరుకూరు, పెదనందిపాడు, ప్రత్తిపాడు, చిలకలూరిపేట, నాదెండ్ల, యడ్లపాడు, పర్చూరు తదితర మండలాల్లో వాగుల వెంబడి
ఉన్న మిర్చి పంట మొత్తం ఊరకలెత్తింది.
మిర్చి పంటను తొలగించి శనగ సాగు చేసేందుకు
రైతులు సిద్ధం అవుతున్నారు.
మిర్చి, పత్తి సాగు చేయలేని రైతులు రబీలో శనగ
పంట వేశారు. ప్రస్తుతం 10 నుంచి 30 రోజుల వ్యవధిలో లేత దశలో ఉంది. భారీ వర్షాలకు
పంట మొత్తం నీట మునిగి దెబ్బతింది. ఇప్పటివరకు ఎకరాకు రూ.20వేల వరకు పెట్టుబడి
రూపంలో ఖర్చు చేసినట్లు వ్యవసాయదారులు చెబుతున్నారు.