డీప్ ఫేక్ బాధితులు పెరిగిపోతున్నారు. డీప్ ఫేక్ను అరికట్టేందుకు కేంద్రం కఠిన నిబంధనలు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తుండగానే కొందరు చెలరేగిపోతున్నారు. ప్రముఖ నటి రష్మిక డీప్ ఫేక్ వీడియో దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి మరువక ముందే మరో నటి ప్రియాంకా చోప్రా డీప్ ఫేక్ వీడియో వైరల్ గా మారింది.
బాలీవుడ్ కథానాయిక ప్రియాంకా చోప్రాకు (priyanka chopra) గతంలో మాట్లాడిన వీడియోలోని సంభాషణలను ఓ నకిలీ బ్రాండ్ ప్రమోట్ చేస్తున్నట్లు సృష్టించారు. ఈ బ్రాండ్ వల్ల తన వార్షిక ఆదాయం ఈ ఏడాది భారీగా పెరిగిందని, అందరూ దానినే ఉపయెగించాలంటూ ఆ వీడియోలో ప్రియాంక చెప్పినట్లు రూపొందించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.