Revanth Reddy met Mallikarjun
Kharge: తెలంగాణ
కాబోయే ముఖ్యమంత్రి, సీఎల్పీ నేత రేవంత్ రెడ్డి దిల్లీ పర్యటనలో బిజీబిజీగా
గడుపుతున్నారు. కాంగ్రెస్ అగ్రనేతలతో మర్యాదపూర్వకంగా భేటీ అవుతూ తన ప్రమాణస్వీకార
కార్యక్రమానికి హాజరుకావాలని కోరుతున్నారు, అలాగే మంత్రిమండలి కూర్పుపై కూడా
సలహాలుసూచనలు తీసుకుంటున్నారు.
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయిన
రేవంత్ రెడ్డి ఆయనకు పుష్పంగుచ్ఛం అందజేసి శాలువతో సన్మానించారు. అలాగే కేసీ వేణుగోపాల్
తోనూ సమావేశం అయ్యారు. సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలను కూడా కలిసి, ఎల్బీ
స్టేడియంలో జరిగే కాంగ్రెస్ కృతజ్ఞత సభలో పాల్గొనాలని కోరారు.
గురువారం
ఉదయం 10.28 గంటలకు రేవంత్ ప్రమాణస్వీకారం ఉంటుందని తొలుత నిర్ణయించారు. అయితే ఆ
సమయాన్ని మార్చారు. మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు.
హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. సీఎస్, డీజీపీ
ఏర్పాట్లను పర్యవేక్షించారు.
హైదరాబాద్
లోని రేవంత్ నివాసం వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నిబంధనలు కఠినతరం చేశారు.
ఈ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేసిన వారితో పాటు ఓడిన వారికి
కూడా మంత్రి మండలిలో చోటు కల్పించే అంశంపై కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది.
జీవన్
రెడ్డి, అద్దంకి దయాకర్, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీకి మంత్రిమండలిలో చోటు దక్కే
అవకాశం ఉందని కాంగ్రెస్ ముఖ్యనేతలు చెబుతున్నారు.