రాజస్థాన్‌లోని రాజ్‌పుత్ నాయకుడు, రాష్ట్రీయ రాజ్‌పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్‌దేవ్ సింగ్‌ని (sukhdev singh) గుర్తు తెలియని దుండగులు దగ్గర నుంచి కాల్చి చంపారు. జైపుర్‌లోని ఆయన ఇంట్లోనే ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అతి సమీపం నుంచి ఇద్దరు దుండగులు సుఖ్‌దేవ్ సింగ్‌ను కాల్చి చంపారు.
పోలీసుల సమాచారం ప్రకారం. ఇద్దరు వ్యక్తులు సుఖ్‌దేవ్ సింగ్ ఇంట్లోకి ప్రవేశించారు. వెంటనే ఆయనపైకి కాల్పులు జరిపారు. గుర్తించిన స్థానికులు ఆయన్ను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆయన చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ కాల్పుల్లో ఆయన భద్రతా సిబ్బంది ఒకరు గాయపడ్డారు. మరొక సాధారణ వ్యక్తి కూడా గాయపడ్డాడని పోలీసులు తెలిపారు.