రాష్ట్రీయ
స్వయం సేవక్ సంఘ్(RSS) వ్యవస్థాపకుడు డాక్టర్ హెగ్డేవార్ స్మృతివనానికి
కుందకుర్తిలో భూమిపూజ చేశారు. డాక్టర్ కేశవ్ బలిరామ్ హెగ్డేవార్ పూర్వికులది తెలంగాణ లోని మహారాష్ట్ర సరిహద్దుకు సమీపానగల కందకుర్తి గ్రామం. ఈ గ్రామం వద్ద గోదావరిలో మంజీర, హరిద్ర నదులు కలసి త్రివేణి
సగమం ఏర్పడుతుంది.
హెగ్డేవార్ తల్లిదండ్రులు అక్కడి నుంచి నాగాపూర్ కు వలసపోయారు.
హెగ్డేవార్ స్మారక భవన భూమిపూజ కార్యక్రమంలో
భువనేశ్వరీ పీఠాధిపతి శ్రీ పూజ్య కమలానందభారతీ స్వామిజీ, విశిష్ట అతిథిగా
పాల్గొన్నారు.
ప్రస్తుతం
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండల పరిధిలో కందకుర్తి గ్రామం ఉంది. నాగపూర్ కు 300
కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంది.
హేగ్డేవార్
పూర్వీకుల గ్రామమైన కందకుర్తికి ఎంతో ప్రాచీన, సాంస్కృతిక చరిత్ర ఉంది. ఈ
వేదభూమిలో వందేళ్ల నాటి రామాలయంతో పాటు స్వయంభు అమృతేశ్వర స్వామి ఆలయం ఉంది.
అయోధ్యకు చెందిన శ్రీ సీతారామ త్యాగి మహరాజ్ నిర్మించిన శనిదేవుడి ఆలయం కూడా ఈ గ్రామంలో
ఉండటం మరో విశేషం.
విశాలభావాలతో
శ్రీ కేశవ సేవా సమితి ఈ స్మృతివనాన్ని నిర్మిస్తోంది. కేవలం ఓ భవనంగా కాకుండా
కందకుర్తిని సామాజిక, సాంస్కృతిక కేంద్రంగా అభివద్ధి చేసే లక్ష్యంతో దీనిని
నిర్మిస్తున్నారు. 2025లో నిర్వహించే
ఆర్ఎస్ఎస్ శతవార్షికోత్సవం సందర్భంగా ఓ పాఠశాల, ఆశ్రమవ, యువతకు వివిధ విభాగాల్లో
శిక్షణ ఇచ్చేందుకు ఓ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయాలని భావిస్తోంది.