ISRO brings
back : చంద్రయాన్ -3 ప్రయోగానికి సంబంధించిన
తాజా సమాచారాన్ని ఇస్రో వెల్లడించింది. చంద్రయాన్-3 ప్రొపల్షన్
మాడ్యూల్ కక్ష్యను విజయవంతంగా మార్చినట్లు పేర్కొంది. ఒక కక్ష్య పెంపు విన్యాసం,
ట్రాన్స్-ఎర్త్ ఉత్తేజిత ప్రక్రియ ద్వారా ప్రొపల్షన్ మాడ్యూల్ ను భూకక్ష్యలోకి
ప్రవేశపెట్టినట్లు తెలిపింది.
ప్రొపల్షన్
మాడ్యుల్ మార్గాన్ని మార్చడం ద్వారా 100 కిలోల ఇంధనాన్ని ఇస్రో ఆదా చేసింది.
దీనిని మరికొన్ని పరిశోధనల కోసం వినియోగిస్తారు. చంద్రుడి క్షక్ష్య నుంచి
మార్గాన్ని భూకక్ష్య వైపు మళ్లించారు. దీనిపై ఉన్న షేప్ పేలోడ్ భూమిపై పరిశోధనలు
చేయనుంది. చంద్రయాన్ -3లోని మూడు ప్రధాన భాగాల్లో ప్రొపల్షన్ మాడ్యూల్ ఒకటి.
దీనితో ల్యాండర్ మాడ్యుల్ అనుసంధానమై ఉంటుంది.
ఈ
ఏడాది జులై 14న ఇస్రోచంద్రయాన్-3 ప్రయోగాన్ని చేపట్టగా, ఆగస్టు 23న విక్రమ్
ల్యాండర్ విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై కాలుమోపింది. ప్రజ్ఞాన్ రోవర్ 14 రోజుల పాటు
జాబిల్లిపై పరిశోధనలు జరిపి అక్కడి నుంచి విలువైన సమాచారాన్ని ఇస్రోకు చేరవేసింది.
రెండు వారాల తర్వాత ‘స్లీపింగ్ మోడ్’లోకి వెళ్లింది. మేల్కొలిపేందుకు ఇస్రో
చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు.