Cyclone Michaung update: బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం కాసేపట్లో తీరం
దాటబోతుంది. ఇప్పటికే తీరాన్ని సమీపించిన తుఫాను బాపట్ల వద్ద తీరం దాటునుంది. తీరం
దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. మంగళవారం ఉదయం
గంటకు 7కిలోమీటర్ల వేగంతో కదిలిన తుపాను, ప్రస్తుతం 12 కిలోమీటర్ల వేగంతో
పయనిస్తోందని విశాఖపట్నం వాతావరణం కేంద్రం అధికారి సునంద తెలిపారు.
ఇప్పటికే
రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా, రేపు కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని
వాతావరణ శాఖ అంచనా వేసింది. బాపట్ల,
నిజాంపట్నం, మచిలీపట్నంలో 10వ నంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండగా, కాకినాడలో 9, విశాఖ,
కళింగపట్నంలో 3వ నంబరు హెచ్చరిక కొనసాగుతోంది. మిగ్ జాం ప్రభవంతో బాపట్ల, సూర్యలంక
తీరాల్లో గంటకు 90 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి.
తుపాను
కారణంగా తిరుమలలో భక్తులు అల్లాడుతున్నారు. వర్షాలకు తోడు పొగమంచుతో నానా తంటాలు
పడుతున్నారు. అతిథిగృహాలు, ఘాటు రోడ్లు వద్ద చెట్లు కూలడంతో రాకపోకలకు అంతరాయం
ఏర్పడింది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా పాపవినాశనం, శ్రీవారిమెట్టు, కపిలతీర్థం,
జాపాలి మార్గాలను టీటీడీ మూసివేసింది.
తిరుమలలోని నీటి ప్రాజెక్టులు కూడా పూర్తిస్థాయి
నీటిమట్టానికి చేరుకున్నాయి. పాపవినాశనం,
గోగర్భం డ్యామ్ గేట్లు ఎత్తి నీటిని వదిలారు. రెండురోజులుగా 200 మిల్లీలీటర్ల
వర్షపాతం నమోదైంది. జలాశయాలు నిండుకుండలా మారడంతో ఏడాదిన్నర వరకు నీటి ఇక్కట్లు
ఉండవని టీటీడీ అధికారులు చెబుతున్నారు.
తుపాను
ప్రభావంపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. బాధితులందరికీ మంచి సదుపాయాలు
అందించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి తుఫాను తగ్గిన వెంటనే ఎన్యుమురేషన్ ప్రారంభించాలన్నారు.