Khalistani Terrorist : పాకిస్తాన్‌లో మరో
ఖలిస్థానీ ఉగ్రవాది మృతి చెందాడు. ఖలిస్థానీ లిబరేషన్ ఫోర్స్, ఇంటర్నేషనల్ సిఖ్
యూత్ ఫెడరేషన్ (ISYF) సంస్థలకు చీఫ్ అయిన
లఖ్‌బీర్ సింగ్ రోడే మరణించాడు.
డిసెంబర్
2న గుండెపోటుతో ఆయన మృతిచెందారు. మనదేశం గతంలోనే అతడిని ఉగ్రవాదిగా ప్రకటించింది. పాకిస్తాన్
లో అతడి అంత్యక్రియలు పూర్తిచేసినట్లు బంధువులు వెల్లడించారు.
ఖలిస్థానీ
ఉగ్రవాది బింద్రన్‌వాలేకు లఖ్‌బీర్ సింగ్ రోడే సమీప బంధువు. 2021లో ఫాజిల్కా జిల్లా జలాలబాద్‌లో
జరిగిన పేలుడు ఘటనకు సంబంధించి ఇతడిపై కేసు నమోదైంది.
1984లో ప్రారంభమైన ఐఎస్‌వైఎఫ్ సంస్థ కెనడా, యూకేలో కార్యకలాపాలు కొనసాగిస్తోంది. అమెరికా
విదేశాంగశాఖ దీనిని ఉగ్రసంస్థగా ప్రకటించింది. 2002లో పోటా చట్టం కింద
భారత్ దీనిపై నిషేధం విధించింది.
ఈ సంస్థకు ఇస్లామిక్ తీవ్రవాదులతో సంబంధాలు
ఉన్నాయనే అభియోగాల కింద పలు దేశాలు కూడ ఆంక్షలు మోపాయి. దీంతో సిఖ్ ఫెడరేషన్ గా ఆ సంస్థ పేరు
మార్చుకుంది.
పంజాబ్‌లో
ఆయుధాలు, పేలుడు
పదార్థాలు, డ్రగ్స్ చేరవేస్తున్నారనే
అభియోగాల కింది రోడేతో పాటు మరో ఎనిమిది మందిపై కేసులు నమోదు అయ్యాయి.
పాకిస్తాన్ లో దాక్కున్న చాలా
మంది ఉగ్రవాదులు ఇటీవల హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. మే లో ఖలిస్థానీ కమాండో
ఫోర్స్ అధినేత పరంజీత్ సింగ్ పన్వార్ కూడా హత్యకు గురయ్యారు.