తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన మెజారిటీ సాధించిన విషయం తెలిసిందే. అయితే సీఎం అభ్యర్థిని మాత్రం ఆ పార్టీ అధిష్ఠానం ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. ఇవాళ సాయంత్రానికి తెలంగాణ సీఎం అభ్యర్థి (telangana cm) ఎవరో ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీలో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ సమావేశాలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కూడా హాజరయ్యారు. తెలంగాణకు కాబోయే సీఎం ఎవరంటూ కొందరు విలేకరులు వేసిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఇవాళ సాయంత్రానికి దీనిపై స్పష్టత ఇస్తామని ఆయన ప్రకటించారు.
ఇప్పటికే ఢిల్లీకి చేరకున్న కాంగ్రెస్ సీనియర్ నేతలు డీకే శివకుమార్, మాణిక్రావు తెలంగాణలో పరిస్థితులను అధిష్టానికి వివరించారు. ఇవాళ మధ్యాహ్నం మల్లిఖార్జున ఖర్గేతో సమావేశం కానున్నారు. మరోవైపు కాంగ్రెస్ సీనియర్ నేతలు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీకి చేరుకున్నారు. వారు ఖర్గేతో సమావేశం అయ్యే అవకాశముంది.