MLA Eshwar Sahu: ఓ రాజకీయ దిగ్గజంపై సామాన్య దినసరి కూలీ విజయం
సాధించడంతో పాటు ఆ రాష్ట్ర రాజకీయ
ముఖచిత్రాన్ని తారుమారు చేయడంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్
అసెంబ్లీ ఎన్నికల్లో చోటుచేసుకుంది.
ఛత్తీస్‌గఢ్‌కు
చెందిన ఈశ్వర్ సాహూ ఓ దినసరి కూలీ. పనికి వెళితేనే రోజు గడిచే ఆర్థిక పరిస్థితి
అతనిది. కానీ అతని జీవితంలో చోటుచేసుకున్న విషాద ఘటనతో రాజకీయాల్లోకి
అడుగుపెట్టారు. గత ఏడాది జరిగిన మతపరమైన అల్లర్లలో ఈశ్వర్ సాహూ తన కుమారుడు
భువనేశ్వర్ సాహూను కోల్పోయారు.
సనాతన
ధర్మాన్ని అనుసరించేవారిపట్ల కాంగ్రెస్ అనుసరిస్తున్న వైఖరితో పాటు ఇతర మతాల ఓట్ల
కోసం ఆ పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై తీవ్రంగా మనోవేదన చెందానని చెబుతున్న సాహూ,
ఈసారి తన నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ వ్యతిరేకపోరాటం చేశాడు. తద్వారా సాజూ
నియోజకవర్గం, బీరాన్‌పూర్ లో జరిగిన అల్లర్ల పై రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున
చర్చ జరిగింది. దోషులకు పాలక కాంగ్రెస్ అండగా నిలిచిందని ఈశ్వర్ సాహూ ఆరోపించారు.
కాంగ్రెస్
తరఫున పోటీచేసిన రవీంద్ర చౌబే, గతంలో ఏడుసార్లు శాసనసభకు ఎన్నికయ్యారు. బీజేపీ
నుంచి పోటీ చేసిన ఈశ్వర్ సాహూ, చౌబేపై
5,527 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
ఈ
ఏడాది ఏప్రిల్ 8న ఛత్తీస్‌గఢ్ లో బెమెతర జిల్లా సాజూ పోలీస్ స్టేషన్ పరిధిలో
బీరాన్‌పూర్ గ్రామానికి చెందిన భువనేశ్వర్ సాహూ అనే యువకుడు దారుణ హత్యకు
గురయ్యాడు.
స్కూలు
విద్యార్థుల మధ్య రేగిన చిన్న వివాదం… హిందూ, ముస్లిం సమూహాల మధ్య గొడవకు
దారితీసింది. దీంతో ఇస్లాంను అనుసరించే కొందరు వ్యక్తులు భువనేశ్వర్ సాహూపై దాడి
చేశారు. స్పృహ తప్పిన అతడిని తమ వెంట తీసుకెళ్ళారు. ఆ ఆ తర్వాత ఓ బహిరంగ ప్రదేశంలో అతడి మృతదేహం
లభ్యమైంది.
లవ్
జీహాదీ ఘటనలకు నిరసనగా అక్కడ హిందూ సంఘాలు ఓ సభ కూడా నిర్వహించాయి. ఆ తర్వాతే
భువనేశ్వర్ హత్యకు జరిగిందని అతడి తల్లిదండ్రులు చెబుతున్నారు.
90 అసెంబ్లీ
స్థానాలు ఉన్న ఛత్తీస్‌గఢ్ లో బీజేపీ 54 స్థానాల్లో విజయం సాధించి పాలక పార్టీగా
అవతరించింది.