మిగ్జాం తుపాను ఏపీ తీరంలో అలకల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం ఈ తుపాను నెల్లూరు జిల్లా కావలికి 40 కి.మీ. బాపట్లకు 80 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. తుపాను ప్రభావంతో కోస్తాంధ్రలో అతి భారీ వర్షాలు (cyclone alert) కురిశాయి. తీర ప్రాంతాల్లో గంటకు 90 నుంచి 110 కి.మీ వేగంలో పెనుగాలులు వీస్తున్నాయి. ఇవాళ సాయంత్రానికి బాపట్ల, కావలి మధ్య ఈ తుపాను తీరందాటే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
మిగ్జాం తుపాను గంటకు 7 కి.మీ వేగంతో కదులుతోంది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విశాఖపట్నం, రాజమహేంద్రవరం, కాకినాడ, భీమవరం, ఏలూరు, విజయవాడ, మచిలీపట్నం, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదతువుతన్నాయి.
గడచిన 24 గంటల్లో నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి. తిరుమలలో కుండపోత వర్షం కురిసింది. రాబోయే రెండు రోజుల్లో
కోస్తా జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది. గత రాత్రి నుంచి గుంటూరు, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు నమోదయ్యాయి.
నాగాయలంకలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఏపీ ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. ఇప్పటికే 36 పునరావాస కేంద్రాలను ప్రారంభించారు. నెల్లూరు, బాపట్ల, కృష్ణా, ప్రకాశం, గుంటూరు జిల్లాల కలెక్టర్లును అప్రమత్తం చేశారు. జిల్లాల కలెక్టర్ కార్యాలయాల్లో హెల్ప్ లైన్ కేంద్రాలను ప్రారంభించారు.ప్రాణ, ఆస్తినష్టం వాటిల్లకుండా తగు జగ్రత్తలు తీసుకోవాలని సీఎం జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు.