జాతీయ భద్రతా సంస్థ మంగళవారం ఉదయం నుంచి జమ్మూ కశ్మీర్‌లోని ఎనిమిది ప్రాంతాల్లో సోదాలు (JK NIA Raids) నిర్వహిస్తోంది. ఉగ్రవాదులకు నిధులు సమకూరుస్తున్నారనే అనుమానాలతో ఎన్ఐఏ ఈ దాడులు ప్రారంభించింది. జమ్మూ కశ్మీర్ పోలీసుల సహకారంతో ఎన్ఐఏ ఈ దాడులకు దిగింది. ఈ సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి.
షోపియాన్, బారాముల్లా ప్రాంతాలతోపాటు జమ్మూ కశ్మీర్‌లోని మొత్తం ఎనిమిది ప్రాంతాల్లో జాతీయ భద్రతా సంస్థ సోదాలు నిర్వహిస్తోంది. అనుమానితుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. కశ్మీర్‌లో ఉగ్రవాదులకు డ్రోన్‌ల ద్వారా పేలుడు పదార్ధాలను చేరవేస్తోన్న వ్యక్తిని అరెస్టు చేసిన మరుసటి రోజే ఈ దాడులు నిర్వహించడం గమనార్హం.
కశ్మీర్ లోయతోపాటు, దేశంలో ఉగ్రవాదాన్ని పోత్సహించేందుకు పాకిస్తాన్ ప్రోత్సహిస్తోన్న ఉగ్రవాదులే లక్ష్యంగా ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోన్నట్లు తెలుస్తోంది.