దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు జీవితకాల రికార్డును నమోదు చేశారు. ఉదయం లాభాలతో మొదలైన స్టాక్ మార్కెట్లు, రోజంతా లాభాల్లోనే కొనసాగాయి. తాజాగా జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం దేశీయ మార్కెట్లకు కలసి వచ్చింది. ఉదయం 823 పాయింట్ల లాభంతో మొదలైన సెన్సెక్స్, మార్కెట్ ముగిసే సమయానికి 1383 పాయింట్లు లాభపడి 68865 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా భారీ లాభాలను మూటగట్టుకుంది. నిఫ్టీ 418 పాయింట్లు పెరిగి, 20601 పాయింట్ల రికార్డును నమోదు చేసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.36 వద్ద ముగిసింది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో టాటా మోటార్స్, విప్రో నష్టాలను చవిచూశాయి. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ, కోటక్ మహింద్రా బ్యాంక్, ఇండస్ ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, హెచ్డీఎఫ్సీ 3 శాతంపైగా లాభాలను గడించాయి. బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఎన్టీపీసీ షేర్లు 2 శాతంపైగా లాభపడ్డాయి. ఎం అండ్ ఎం, భారతీ ఎయిర్ టెల్, పవర్ గ్రిడ్, రిలయన్స్ షేర్లు ఒకశాతంపైగా పెరిగాయి.