మిజోరం అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్ ఫ్రంట్‌కు షాక్ (mizoram eletions results) తగిలింది. ప్రస్తుతం సీఎం జోరంధంగా సహా ఉప ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు కూడా ఓటమిపాలయ్యారు. ప్రస్తుతం వెలువడిన ఫలితాల్లో ప్రతిపక్ష జోరం పీపుల్స్ మూవ్మెంట్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. దీంతో జడ్పీఎం అధ్యక్షుడు లాల్ దుహోమా నేతృత్యంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరనుంది.
మిజోరంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. అధికారం దక్కాలంటే కనీసం 21 స్థానాలు గెలుచుకోవాలి. జడ్పీఎం ఇప్పటికే 21 స్థానాల్లో గెలిచింది. మరో 6 చోట్ల ముందంజలో ఉంది. అధికార ఎంఎన్ఎఫ్ కేవలం 6 స్థానాలు గెలుచుకుంది. మరో నాలుగు చోట్ల ఆ పార్టీ అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. రెండు చోట్ల బీజేపీ, ఒకటి కాంగ్రెస్ అభ్యర్థులు గెలుచుకున్నారు.