అంతర్జాతీయ మార్కెట్ల నుంచి అందిన సానుకూల సంకేతాలతో దేశీయ స్టాక్ సూచీలు దూసుకెళ్లాయి. సోమవారం భారీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు సరికొత్త రికార్డు నమోదు చేశారు. ఉదయం సెన్సెక్స్ 825 పాయింట్ల లాభంతో 68306 వద్ద ప్రారంభమైంది. నిఫ్టీ 248 పాయింట్లు పెరిగి 20516 వద్ద ట్రేడింగ్ ప్రారంభమైంది. డాలరుతో రూపాయి మారకం
విలువ 83.29 వద్ద మొదలైంది.
సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో అన్ని షేర్లు లాభాలార్జించాయి. భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, ఎస్బిఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఎంఅండ్ఎం, ఎల్అండ్టీ, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ కంపెనీల షేర్లు లాభాలతో దూసుకెళుతున్నాయి.
ద్రవ్యోల్భణం దిగిరావడంతో అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లలో కోత వేయవచ్చనే సంకేతాలతో అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్లాయి. ఈ సంకేతాలు దేశీయ మార్కెట్లకు కూడా కలసి వచ్చింది.