తెలంగాణలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరనుంది. నిన్న రాత్రి తెలంగాణ గవర్నర్ తమిళిసైని కలసి ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ సంసిస్ధత తెలిపింది. కాసేపట్లో కాంగ్రెస్
శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. అధిష్ఠానంతో సంప్రదించి సీఎం అభ్యర్థి ఎవరు అనే విషయం తేల్చనున్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సీఎంగా (RevanthReddy) ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారిలో 50 మంది అభ్యర్థులు అధిష్ఠానికి రేవంత్ పేరు సూచించినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ దళిత నేత భట్టి విక్రమార్క కూడా సీఎం పదవి రేసులో నిలిచారు. నిన్న వెలువడిన ఫలితాల్లో కాంగ్రెస్ 65 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.
డిసెంబరు 9న సీఎం అభ్యర్థి హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తారని ప్రకటించినా, అంతకు ముందుగానే కుదిరితే సోమవారమే ఈ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.