సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేశారు.
రాజ్‌భవన్‌కు వెళ్లిన కేసీఆర్ తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు
అందించారు. సీఎం కాన్వాయ్ బదులుగా సొంత
వాహనాల్లోనే ఆయన రాజ్ భవన్ కు వెళ్ళి రాజీనామాలేఖను గవర్నర్ కు అందజేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ 64 స్థానాలు కైవసం చేసుకుంది. దీంతో ఆ పార్టీ అభ్యర్థి రేపు ముఖ్యమంత్రిగా
ప్రమాణస్వీకారం చేయనున్నారు. బీఆర్ఎస్ కు 39 స్థానాలు, బీజేపీ 8 చోట్ల, ఎమ్ఐఎమ్ 7
చోట్ల గెలవగా, పోటీచేసిన ఒక్క చోట సీపీఐ కూడా నెగ్గింది.