రాష్ట్రవ్యాప్తంగా
సమతా సమ్మేళనాలను నిర్వహిస్తున్నట్లు
ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసత కన్వీనర్ రాగాల నరసింహరావు నాయుడు తెలిపారు.
దురాచారాల నిర్మూలన కోసం అనేక మంది మహా పురుషులు పనిచేశారని, వారిని
స్మరిస్తూ, వారి ప్రేరణగా
కుల అసమానతలు, అస్పృశ్యత లేని, దురాచారాలు లేని హిందూ సమాజ నిర్మాణం కోసం ఈ సమ్మేళనాలు
నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
సమతా
సమ్మేళనాలలో ధర్మాచార్యులు, పండితులు, సామాజిక
నేతలు తమ సందేశాలను ఇచ్చారని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
లో 1914 లో విజయవాడలో జరిగిన ఆది ఆంధ్ర సమ్మేళనాన్ని
స్మరిస్తూ నవంబర్ 6 న విజయవాడలో 800 మందితో, సమతా సమ్మేళనాన్ని నిర్వహించారు.
శ్రీకాకుళంలో జూన్ 25 న 1500 మందితో ఉత్తరాంధ్ర సమ్మేళనం, 1925 లో
అనంతపురం లో జరిగిన ఆది హిందూ సమ్మేళనాన్ని స్మరిస్తూ, అక్టోబర్
1 న అనంతపురంలో 1250 మందితో
రాయలసీమ జిల్లాల సమతా సమ్మేళనం, నెల్లూరు
వెంకయ్య స్వామి ఆశ్రమంలో అక్టోబర్ 8న 2,400 మందితో ప్రకాశం,నెల్లూరు,చిత్తూరు జిల్లాల సమతా సమ్మేళనం, నూరేళ్ళ క్రితం 1923 కాకినాడ
కాంగ్రెస్ జాతీయ మహా సభలో శ్రీ గణపతి ముని సమతా సందేశాన్ని స్మరిస్తూ నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం రోజున కాకినాడలో2,700 మందితో ఉభయ గోదావరి జిల్లాల సమ్మేళనాలను నిర్వహించామని
చెప్పారు.
ఈ కార్యక్రమంలో పెద్దసంఖ్యలో ప్రజలు భాగస్వాములు అయ్యారన్నారు.
వివిధ సమ్మేళనాలలో పుస్తక ఆవిష్కరణ
కార్యక్రమాలని నిర్వహించినట్లు వివరించారు. డా.బూదాటి వెంకటేశ్వర్లు రాసిన నిరుద్ద
భారతం పద్యం అర్థంతో పుస్తకం, ఆచార్య
సుబ్బాచారి రచించిన నీరుద్ధ భారతం అర్థంతో పుస్తకం, డా.దుగ్గరాజు
శ్రీనివాసరావు రచన కృష్ణానదీ తీరాన సమతా ఉద్యమాలు, డా.గౌరీశంకర్
ఉత్తరాంధ్రలో సమతా ఉద్యమాలు, వి.వి.సుబ్రమణ్యం; గోదావరీ తీరాన సమతా ఉద్యమ సారథులు, శ్యాం ప్రసాద్ రాసిన మన భారత రాజ్యాంగము ప్రత్యేకతలు వంటి
పుస్తకాల ఆవిష్కరణ జరిగాయని తెలిపారు.
ఎస్సీ పూజారుల మంత్రోచ్చరణతో సభ
ప్రారంభించినట్లు చెప్పారు.
కులాల హెచ్చు తగ్గులు, అస్పృశ్యత
ధర్మ సమ్మతం కాదు, మధ్యలో
వచ్చిన దురాచారాలు ఆచరించడం తగదని వివిధ సభలలో పూజ్య సాధు సంతులు, పూజ్య శ్రీ కమలానంద భారతి స్వామీ, స్వామి
విరజానంద స్వామి, స్వామి
శ్రీనివాసానంద, సహస్రావధాని
పద్మశ్రీ గరికపాటి నరసింహారావు వంటి మహాత్ములు సందేశాలు అందజేశారు.
కేంద్ర
మంత్రులు నారాయణ స్వామి, రాష్ట్ర
మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, మాజీ
రాష్ట్ర మంత్రి గౌతు శ్యామ సుందర శివాజీ, మండలి
బుద్ధ ప్రసాద్ వంటి ప్రముఖులు పాల్గొన్నారని తెలిపారు.
సమరసతా సాధనలో మహిళల బాధ్యత అనే విషయమై శ్రీమతి కోడూరు
జయప్రద, డా.రేణు
దీక్షిత్ , శ్రీమతి సుందరి
రాణి, శ్రీమతి
వింజమూరి సత్య,డా.వోలేటి కనక మహాలక్ష్మి వంటి వారు
హాజరయ్యారన్నారు.
SSF ద్వారా
జరుగుతున్న సమరశతా ప్రయత్నాల పై తాళ్లూరి విష్ణువు, కోట సునీల్ కుమార్, సాయిరాం
లు, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ –
ఆర్.ఎస్.ఎస్.నాయకులు మనం ముందు ఏమి చేయాలి? అనే
అంశంపై అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ , సహ
క్షేత్ర ప్రచారక్ భరత్ కుమార్, రాష్ట్ర
సహ కార్యదర్శి దువ్వూరి యుగంధర్, ప్రాంత
ప్రచారక్ విజయ ఆదిత్య, సహ ప్రాంత
ప్రచారక్ జనార్ధన్ లతో సహా ఇతరులు ప్రసంగించారు.
ఈ సమతా సమ్మేళనాల్లో సామాజిక సమత
కోసం కృషి చేసిన వారిని సన్మానించారు.
ప్రధాన
సందేశం
మన ఆచరణ ద్వారా,మన
ఇంట్లో,మన గ్రామంలో కులాల హెచ్చు తగ్గులు
అస్పృశ్యత లేని పరిస్థితులు నిర్మించాలని తెలియ చేశారు.
ఈ సమతా సమ్మేళనాల అనువర్తి ( follow up
)గా
*మండల స్థాయిలో సామాజిక సమరసత వేదిక కమిటీలను వేయాలని
*ప్రతి జిల్లా లో కొన్ని గ్రామాలను ఎంపిక చేసి ఆ గ్రామాలలోని
అన్ని కులాల యువకులతో సమరసత నిర్మణానానికి కార్యక్రమాలు చేపట్టాలని
* సమ్మేళనాలలో వక్తల సందేశాలను బులెటిన్ ద్వారా,వీడియో ల ద్వారా ప్రచారం చేయాలని
* సామాజిక సమత కోసం ఉద్యమించిన మహాపురుషుల చిత్రాలను ఎక్కువ
గృహాలలో ఉంచాలని నిర్ణయించినట్లు తెలిపారు.